హడావిడిగా వచ్చేస్తే కష్టమేమో…వెంకీ!!

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన వెంకటేష్….అంటే లేడీ ఫ్యాన్స్, ఫ్యామిలీ ఫ్యాన్స్ చాలా ఎక్కువ. అయితే అదే క్రమంలో వరుస హిట్స్ తో ఒకప్పుడు దుమ్ము దులిపేసిన వెంకీ ఈమధ్య కాస్త వెనుక బడ్డాడు. దాదాపుగా నాగవల్లి సినిమా తరువాత కాస్త వెనకడుగు వేసిన వెంకీ…దృశ్యం…గోపాల గోపాల అంటూ కాస్త క్లాస్ హిట్స్ ను అందుకున్నాడు. అదే క్రమంలో కొంచెం లేట్ గా అయినా..లేటెస్ట్ గా వస్తాను అంటూ…”బాబు బంగారం”అంటూ ప్రేక్షకులను పలకరించాడు.

అయితే ఈ బాబు బంగారం కాస్త నిరాశ పరిచినప్పటికీ యావరేజ్ సినిమాగానే నిలబడింది. ఇదిలా ఉంటే…ఈ సినిమా తరువాత వెంకీ ఏ సినిమా చేస్తున్నాడు అన్న అనుమానంతో ఉన్న దగ్గుపాటి ఫ్యాన్స్ కి వెంకీ త్వరలోనే మళ్ళీ “గురు”గా మారి వచ్చేస్తున్నాడు…విషయంలోకి వెళితే….హిందీ- తమిళ్ భాషల్లో సూపర్ హిట్ అయిన సాలా ఖదూస్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు మన వెంకీ. అదే క్రమంలో సుధ కొంగర డైరెక్షన్ లో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామాకు గురు అనే టైటిల్ ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. వెంకీ ఈ మూవీలో బాక్సింగ్ కోచ్ గా నటిస్తుండగా.. త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇదిలా ఉంటే..ఎలా అయినా సరే ఈ సినిమాని 2016లోనే విడుదల చెయ్యాలి అన్న ఆలోచనతో ఉన్న వెంకీ…ఎలా అయినా…డిసెంబర్ నెలలో ఈ సినిమాను ఫినిష్ చేసి…విడుదల చెయ్యాలి అని పక్కా ప్లానింగ్ తో తక్కువ సమయంలోనే పూర్తి చేసే విధంగా రంగం సిద్దం చేసుకున్నాడు. మరి ఇంత హడావిడిగా సినిమా చేస్తే కష్టం ఏమో….కాస్త ఆలోచించు వెంకీ…

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus