Venkatesh, Rajinikanth: వెంకీ ఎంట్రీతో రజినీ నో చెప్పారా?

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా రిలీజైతే తెలుగు, తమిళ భాషల్లో తొలిరోజు టాక్ తో సంబంధం లేకుండా రికార్డులు నమోదవుతాయనే సంగతి తెలిసిందే. రజినీకాంత్ సినిమాకు పోటీగా సినిమాను రిలీజ్ చేయడానికి టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం భయపడతారు. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన దృశ్యం టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మలయాళంలో హిట్టైన దృశ్యంకు రీమేక్ గా అదే టైటిల్ తో తెలుగులో ఈ సినిమా తెరకెక్కింది.

అయితే మొదట దృశ్యం రీమేక్ లో తెలుగు, తమిళ భాషల్లో రజినీకాంత్ నటించాలని భావించారట. తమిళ నిర్మాత కలైపులి థానుతో రజినీకాంత్ దృశ్యం రీమేక్ లో నటించడం గురించి చర్చలు కూడా జరిపారని సమాచారం. అయితే వెంకటేష్ మలయాళ దృశ్యం తెలుగు వెర్షన్ కు సంబంధించిన హక్కులను కొనుగోలు చేయడంతో రజినీకాంత్ నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత తమిళ రీమేక్ లో మాత్రమే నటిస్తే నిర్మాతలకు పెద్దగా లాభం ఉండదని భావించిన రజినీకాంత్ ఈ మూవీలో నటించడానికి అంగీకరించలేదు. రజినీ నో చెప్పడంతో కమల్ హాసన్ దృశ్యం రీమేక్ లో నటించి సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.

ప్రస్తుతం రజినీకాంత్ అన్నాత్తే సినిమాలో నటిస్తుండగా దీపావళి పండుగ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం. తెలుగులో ఈ సినిమా అన్నయ్య లేదా పెద్దన్నయ్య అనే టైటిల్ తో రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని రజినీకాంత్ అన్నాత్తే సినిమాతో హిట్ సాధిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus