సమంత చైతన్య విడిపోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించిన తర్వాత నెటిజన్లలో చాలామంది సమంతను ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు ఇష్టానుసారం థంబ్ నైల్స్ ను పెట్టి వీడియోలను ప్రసారం చేయగా సమంత ఆ యూట్యూబ్ ఛానెళ్లపై పరువు నష్టం దావా వేయగా సమంతకు అనుకూలంగా కోర్టు తీర్పు చెప్పింది. డాక్టర్ సీఎల్ వెంకట్రావు యూట్యూబ్ వీడియోలపై కూడా కూడా సమంత పరువు నష్టం దావా దాఖలు చేశారు.
అయితే తాజాగా సీఎల్ వెంకట్రావు సమంత కేసు గురించి స్పందిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాము కేవలం ఇంటర్వ్యూలో కంటెంట్ ను మాత్రమే ఇస్తామని ఆ థంబ్‌నైల్స్‌కు తమకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. ఎస్‌ఈవో అనే టీమ్ వీటి కోసం ప్రత్యేకంగా పని చేస్తుందని సీఎల్ వెంకట్రావు చెప్పుకొచ్చారు. తమకు తెలియకుండానే థంబ్‌నైల్స్‌కు ఫోటోలు పెడతారని వెంకట్‌రావు వెల్లడించారు. అందువల్ల యూట్యూబ్ ఛానెళ్ల వీడియోలకు ఉండే థంబ్‌నైల్స్‌కు తమకు ఎలాంటి సంబంధం లేదని వెంకట్‌రావు చెప్పుకొచ్చారు.
తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే థంబ్‌నైల్స్‌ను పెట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత వెంకట్‌రావు ఈ కామెంట్లు చేయడం గమనార్హం. ఈ కామెంట్ల గురించి సమంత తరపున ఎవరైనా స్పందిస్తారేమో చూడాల్సి ఉంది. మరోవైపు సమంత ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు. దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత సమంత కొత్త సినిమాలతో బిజీ కానున్నారని తెలుస్తోంది.