వెంకీ అట్లూరి (Venky Atluri) కెరీర్ చూస్తే.. ఒక జెన్యూన్ టాలెంట్ ఎంత దూకుడు చూపించగలదో తెలుస్తుంది. దర్శకుడిగా తొలి చిత్రం తొలిప్రేమ తో (Tholi Prema) ఎంట్రీ ఇచ్చిన వెంకీ, తొలి ప్రయత్నంలోనే హార్ట్‌టచింగ్ లవ్ స్టోరీ అందించి మంచి గుర్తింపు సంపాదించారు. కానీ ఆ తర్వాత వచ్చిన మిస్టర్ మజ్ను (Mr. Majnu), రంగ్ దే (Rang De) వంటి చిత్రాలు పెద్దగా నిలవకపోవడంతో కొంత వెనక్కి తగ్గినట్టు అనిపించింది. అయితే దాంతోనే ఆగిపోకుండా తనకు అసలైన గెలుపు చూపించే ప్రాజెక్ట్ కోసం మళ్లీ గేమ్ ప్లాన్ చేశారు. ఆ గేమ్ ఛేంజర్ సార్ (Sir) రూపంలో వచ్చింది.
ధనుష్‌తో (Dhanush) తెలుగు-తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మంచి సందేశంతో పాటు కమర్షియల్‌గా కూడా బలంగా నిలిచింది. ఈ సినిమా విజయంతో వెంకీ అట్లూరి మార్కెట్ మళ్లీ పుంజుకుంది. ఇక లక్కీ భాస్కర్ (Lucky Baskhar) అనే ప్రయోగాత్మక కాన్సెప్ట్‌తో దుల్కర్ సల్మాన్‌ను (Dulquer Salmaan) కొత్త షేడ్స్‌లో చూపించి ఓటీటీ, థియేటర్స్ రెండింటిలోనూ హిట్ అందుకున్నారు. ఇప్పుడు వెంకీ అట్లూరి పాజిటివ్ మోమెంట్‌లో ఉన్నారు. ప్రస్తుతం సూర్యతో (Suriya) ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. దీంతో పాటు కోలీవుడ్ మాస్ హీరో అజిత్ కుమార్‌కి (Ajith Kumar) కూడా వెంకీ స్టోరీ వినిపించనున్నట్టు సమాచారం. స్టోరీ నచ్చితే ఈ ప్రాజెక్ట్‌కి లైన్ క్లియర్ అనే టాక్ ఫిల్మ్ నగర్‌లో జోరుగా వినిపిస్తోంది. అయితే అంతే కాదు.. మెగాస్టార్ చిరంజీవితో (Chiranjeevi) వెంకీ అట్లూరి సినిమా తీస్తారనే వార్తలు కూడా చాలా కాలంగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే స్టోరీ లైన్ స్టేజ్‌లో ఉన్నట్టు టాక్. సరైన టైమ్‌కు ప్రాజెక్ట్ అఫీషియల్‌గా అనౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది.
చిరు విత్ వెంకీ అంటే స్టైల్, ఎమోషన్ కలబోతగా ఉండే సినిమా అని అభిమానులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి వరుసగా స్టార్ హీరోల నుంచి అవకాశాలు రావడం, విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ వెళ్తున్న వెంకీ అట్లూరి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఫుల్ ఫోకస్ ఆకర్షిస్తున్న దర్శకుడిగా నిలుస్తున్నారు. కథను చెప్పే విధానం, ఎమోషనల్ డెప్త్‌తో సినిమాలను తీర్చిదిద్దే వెంకీకి, రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద అవకాశాలు రావడం ఖాయం అని చెప్పొచ్చు.