త్రివిక్రమ్ – శివ కార్తికేయన్.. ఈ గ్యాప్లో అంత కథ నడిచిందా?

‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) అల్లు అర్జున్ తో (Allu Arjun) ఒక భారీ బడ్జెట్ సినిమా చేయాలని అనుకున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ కాంబోలో సినిమా రూపొందుతుంది అని అటు బన్నీ వాస్ (Bunny Vasu), ఇటు నాగవంశీ (Suryadevara Naga Vamsi ) చెప్పుకొచ్చారు. కానీ కట్ చేస్తే.. స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులకి ఎక్కువ టైం పడుతుండటంతో.. అల్లు అర్జున్… దర్శకుడు అట్లీకి (Atlee Kumar) ఛాన్స్ ఇచ్చాడు.

Trivikram, Sivakarthikeyan

ఈ ప్రాజెక్టు ఫినిష్ అవ్వడానికి ఎంత కాదనుకున్నా 2 ఏళ్ళు టైం పడుతుంది. అందుకే త్రివిక్రమ్ ఈ గ్యాప్లో ఓ మిడ్ రేంజ్ సినిమా చేయాలని అనుకున్నాడు. వెంకటేష్ తో త్రివిక్రమ్ ఓ సినిమా చేయబోతున్నట్లు మరోసారి ప్రచారం జరిగింది. దాని విషయంలో ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు. అయితే ఇటీవల తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ ని (Sivakarthikeyan) కూడా త్రివిక్రమ్ టీం అప్రోచ్ అయ్యిందట. శివ కార్తికేయన్ ఇమేజ్ కి తగ్గ కథ త్రివిక్రమ్ వద్ద ఉంది.

మరోపక్క శివ కార్తికేయన్ కూడా త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి హ్యాపీగానే ఒప్పుకున్నాడట. కానీ ఈ ప్రాజెక్టు కోసం అతను ఏకంగా రూ.70 కోట్లు పారితోషికం డిమాండ్ చేసినట్లు వినికిడి. దీంతో త్రివిక్రమ్ టీంకి పెద్ద షాక్ తగిలినట్టు అయ్యిందట. నిన్న మొన్నటి వరకు శివ కార్తికేయన్ తమిళంలో మిడ్ రేంజ్ హీరోగా ఉండేవాడు. వరుసగా ‘డాక్టర్’ ‘అయలాన్’ (Ayalaan) వంటి సినిమాలతో వంద కోట్లు కొల్లగొట్టాడు. ‘అమరన్’ (Amaran) అయితే ఏకంగా రూ.300 కోట్లు కొల్లగొట్టింది.

ఎలా చూసుకున్నా.. తమిళంలో శివకార్తికేయన్ కి రూ.150 కోట్ల వరకు మార్కెట్ ఉంది. అలా అని ఏకంగా రూ.75 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తే మిడ్ రేంజ్ నిర్మాతలు ఎలా తట్టుకుంటారు చెప్పండి. అందుకే త్రివిక్రమ్ టీం మేటర్ ని సాగదీయకుండా ఫ్లైట్ ఎక్కేసి… హైదరాబాద్ తిరిగొచ్చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనా వాళ్ళని శివ కార్తికేయన్ గట్టిగానే భయపెట్టాడు అని చెప్పాలి.

 ‘డియర్ ఉమ’ నుండి అలరిస్తున్న ‘వైద్యమా’ పాట!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus