ఒక సినిమా ఫ్లాప్ అవ్వడానికి, హిట్ అవ్వడానికి ఒక్కోసారి చాలా రీజన్స్ ఉంటాయి. కానీ.. ఒక్కోసారి పెద్దగా రీజన్స్ ఉండవు. వెతుకుదామన్నా కనిపించవు. అందుకు తాజా నిదర్శనం “వెంకీ మామ”. వెంకటేష్, నాగచైతన్య జంటగా నటించిన ఈ చిత్రం హుటాహుటిన డిసెంబర్ 13న విడుదలై.. విడుదలైన అన్నీ ఏరియాల్లో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే.. ఆశించిన స్థాయిలో రివ్యూలు మాత్రం రాలేదు ఈ చిత్రానికి. వెంకటేష్ స్క్రీన్ ప్రెజన్స్ & కామెడీని పక్కన పెడితే.. సినిమాలో ఆకట్టుకొనే కథ-కథనాలు ఎక్కడున్నాయని సినిమా చూసిన చాలా మంది మొత్తుకున్నారు.
దాంతో ఆ సోషల్ మీడియా రెస్పాన్స్ సినిమా కలెక్షన్స్ పై ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందేమో అనుకున్నారు. కట్ చేస్తే.. ఫస్ట్ డే, సెకండ్ డే కంటే మూడోరోజు కలెక్షన్స్ ఎక్కువగా ఉండడాన్ని చూసి మార్కెటింగ్ వర్గాలు సైతం షాక్ అవుతున్నాయి. జనాలు వెంకటేష్ కామెడీని ఎంజాయ్ చేయడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ.. కథ-కథనాలను పట్టించుకోవడం లేదని అర్ధమైంది. దాంతో సినిమాలో కంటెంట్ కంటే వెంకీ మామ మ్యాజిక్కే బాగా వర్కవుట్ అయ్యింది. ఇప్పటికే 30 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ చిత్రం 50 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని సురేష్ & కో అంచనా.
Click Here For VenkyMama Movie Review
వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!