Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!

  • December 13, 2019 / 09:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!

“ఎఫ్ 2” లాంటి సూపర్ సక్సెస్ తర్వాత వెంకటేష్, “మజిలీ” లాంటి డీసెంట్ హిట్ అనంతరం నాగచైతన్య నటించిన చిత్రం “వెంకి మామ”. మల్టీస్టారర్ సినిమాగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రం విడుదల తేదీ విషయంలో మాత్రం కాస్త టెన్షన్ పడి.. ఇంకాస్త టెన్షన్ పెట్టి ఎట్టకేలకు నేడు విడుదలైంది. రాశీఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకొందో చూద్దాం..!!

కథ: మేనల్లుడు కార్తీక్ (నాగచైతన్య) కోసం పెళ్లి కూడా చేసుకోకుండా.. వాడి ఆనందమే తన ఆనందంగా బ్రతుకుతుంటాడు మిలిటరీ నాయుడు అలియాస్ వెంకటరత్నం నాయుడు అలియాస్ వెంకి మామ (వెంకటేష్). తన భుజాల మీద పెరిగిన మేనల్లుడు, తనతో కలిసి మందుకొట్టిన మేనల్లుడు ఒక్కసారి దూరమవుతాడు. దగ్గరవ్వాలని ప్రయత్నించినా కనికరించడు. తనే ప్రాణంగా పెరిగిన మేనల్లుడు తనను ఎందుకు దూరం పెడుతున్నాడో అర్ధం కాక మదనపడుతున్న వెంకి మామకు.. దీనంతటికీ కారణం తన తండ్రి (నాజర్) అని తెలుసుకొంటాడు.

అసలు తనకు చాలా ఇష్టమైన వెంకి మామకు దూరంగా కార్తీక్ వెళ్లిపోవడానికి కారణం ఏమిటి? అందుకు నాజర్ ఎలా కారకుడయ్యాడు? తన మేనల్లుడ్ని మళ్ళీ కలుసుకోవడం కోసం వెంకి మామ చేసిన ప్రయత్నాలు ఏమిటి? అనేది “వెంకి మామ” కథాంశం.

నటీనటుల పనితీరు: టైటిల్ పాత్రకు వెంకీ పూర్తి న్యాయం చేశాడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సెంటిమెంట్ సీన్స్ & కామెడీ సీన్స్ ను వెంకీ కంటే బాగా ఎవరూ చేయలేరు. వెంకటేష్ కి ఈ క్యారెక్టర్ టైలర్ మేడ్. ఇక నాగచైతన్య మరోమారు మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొన్నాడు. రాశీఖన్నా కేవలం అందాల ప్రదర్శనకే పరిమితమవ్వకుండా నటనతో ఆకట్టుకొంది. పాయల్ రాజ్ పుత్-వెంకటేశ్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. అలాగే వాళ్ళిద్దరి మధ్య హిందీ కామెడీ జనాల్ని భలే నవ్విస్తుంది. నాజర్, రావురమేష్, చమ్మక్ చంద్ర, విద్యుల్లేఖ రామన్, హైపర్ ఆది పాత్రలు ఆకట్టుకొంటాయి.

సాంకేతికవర్గం పనితీరు: ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ వర్క్ & సురేష్ ప్రొడక్షన్స్ వారి ప్రొడక్షన్ డిజైన్ బాగుంది. తమన్ సమకూర్చిన బాణీలు అలరిస్తాయి. నేపధ్య సంగీతంతోనూ ఆకట్టుకున్నాడు తమన్.

జాతకాలు, మానవీయ బంధాల నేపధ్యంలో బాబీ-కోన వెంకట్ ఒక సాధారణమైన కథను రాసుకొని.. దానికి మిలటరీ బ్యాక్ డ్రాప్ యాడ్ చేసి మంచి పని చేశారు. వెంకటేశ్ సినిమా నుండి జనాలు ఏం ఆశిస్తారో జనాలకు అవన్నీ అందించారు. ఆరోగ్యకరమైన హాస్యం, మాస్ ఎలిమెంట్స్ ఉన్న ఫైట్స్, సెంటిమెంట్ అన్నీ పుష్కలంగా ఉన్నాయి ఈ చిత్రంలో. అయితే.. ఫస్టాఫ్ వరకు చాలా సరదాగా సాగిపోయిన కథ సెకండాఫ్ లో మాత్రం కాస్త నెమ్మదిస్తుంది. ముఖ్యంగా కాశ్మీర్ ఎపిసోడ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కు విందు భోజనం లాంటిది “వెంకి మామ” చిత్రం. కథనంలో ఉన్న చిన్నపాటి లోటును తన స్క్రీన్ ప్రెజన్స్ తో కవర్ చేసేశాడు మన వెంకీ.

విశ్లేషణ: ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసి తీసిన “వెంకి మామ” వాళ్ళను సంతృప్తిపరచడంలో సక్సెస్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వెంకీ-నాగచైతన్యల కాంబో కోసం.. రాశీఖన్నా-పాయల్ అందాల కోసం, రెండున్నర గంటల టైమ్ పాస్ కోసం హ్యాపీగా ఒకసారి చూడదగ్గ చిత్రం “వెంకి మామ”.

రేటింగ్: 3/5

Click Here To Read In English

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Daggubati Venkatesh
  • #K. S. Ravindra
  • #Payal Rajput
  • #Raashi khanna

Also Read

Jatadhara Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘జటాధర’.. అదే కారణమా?

Jatadhara Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘జటాధర’.. అదే కారణమా?

The Girl Friend Collections: 2వ వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 2వ వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’

Kaantha Collections: వీకెండ్ కి ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?

Kaantha Collections: వీకెండ్ కి ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?

This Week Releases: ఈ వారం 19 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 19 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

రోడ్డుపై కొట్టుకున్న సినిమా వాళ్లు

రోడ్డుపై కొట్టుకున్న సినిమా వాళ్లు

Sivaji: ఐబొమ్మ రవి దేశానికి పనికొచ్చే వ్యక్తి

Sivaji: ఐబొమ్మ రవి దేశానికి పనికొచ్చే వ్యక్తి

related news

OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

trending news

Jatadhara Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘జటాధర’.. అదే కారణమా?

Jatadhara Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘జటాధర’.. అదే కారణమా?

1 hour ago
The Girl Friend Collections: 2వ వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 2వ వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’

2 hours ago
Kaantha Collections: వీకెండ్ కి ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?

Kaantha Collections: వీకెండ్ కి ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?

2 hours ago
This Week Releases: ఈ వారం 19 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 19 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
రోడ్డుపై కొట్టుకున్న సినిమా వాళ్లు

రోడ్డుపై కొట్టుకున్న సినిమా వాళ్లు

2 hours ago

latest news

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

21 hours ago
Balakrishna: నా డిక్షనరీలో సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు: బాలయ్య

Balakrishna: నా డిక్షనరీలో సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు: బాలయ్య

21 hours ago
Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

21 hours ago
Kanchana 4 Movie: కాంచన 4: ఆల్రెడీ రాఘవ లారెన్స్ 100 కోట్ల బిజినెస్!

Kanchana 4 Movie: కాంచన 4: ఆల్రెడీ రాఘవ లారెన్స్ 100 కోట్ల బిజినెస్!

23 hours ago
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version