Venky Movie: ఆ తప్పు వల్ల రవితేజ వెంకీ మూవీకి నష్టాలు.. నిర్మాత ఏమన్నారంటే?

రవితేజ శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కిన వెంకీ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గానిలిచిన సంగతి తెలిసిందే. అటు రవితేజ అభిమానులను ఇటు శ్రీను వైట్ల అభిమానులను మెప్పించిన ఈ సినిమాకు అప్పట్లో భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. అట్లూరి పూర్ణచంద్ర రావు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అయితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైనా తనకు మాత్రం వెంకీ సినిమాతో 60 లక్షల రూపాయల నష్టం వచ్చిందని ఆయన తెలిపారు.

ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు. (Venky Movie) వెంకీ సినిమాను తీసుకున్న బయ్యర్లు అందరికీ కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు వచ్చాయని ఆయన తెలిపారు. థియేటర్లలో సైతం వెంకీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందని పూర్ణచంద్రారావు కామెంట్లు చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాకు ఏకంగా 60 లక్షల రూపాయల నష్టాలు వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు.

తాను నిర్మించిన ఔనన్నా కాదన్నా సినిమా కూడా నష్టాలను మిగిల్చిందని పూర్ణచంద్రారావు వెల్లడించారు. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలు సైతం నిర్మాతలను ముంచేస్తున్నాయని తెలిసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. వెంకీ మూవీ రీరిలీజ్ లో సైతం చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది. రవితేజ క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

రవితేజ నటించిన ఈగల్ మూవీ మార్చి నెల 1వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్ యాప్ లలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన ఈగల్ కు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ లో మిస్టర్ బచ్చన్ టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా రవితేజ ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్ అందుకుంటారో చూడాలి.

పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?

‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus