Vennela Kishore: ఈసారైనా హిట్ అందుకుంటాడా..?

చాలా మంది నటులకు దర్శకులుగా మారాలని ఉంటుంది. ఈ క్రమంలో కొందరు ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశారు. కానీ సక్సెస్ అయిన వాళ్లు మాత్రం చాలా తక్కువ. గతంలో కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా దర్శకుడిగా రెండు సినిమాలు చేశాడు. బ్రహ్మానందం ప్రధాన పాత్రలో ‘జఫ్ఫా’ అనే సినిమా తీశాడు వెన్నెల కిషోర్. ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయింది. అలానే ‘వెన్నెల’ సినిమాకి సీక్వెల్ గా ‘వెన్నెల 1.5’ అనే సినిమా తీశాడు. ఇది కూడా డిజాస్టర్ అయింది.

దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన రెండు సినిమాలు ప్లాప్ అవ్వడంతో కొన్నాళ్లు సైలెంట్ అయిపోయాడు కిషోర్. నటుడిగా బిజీ అవ్వడంతో ఇక డైరెక్షన్ ఆలోచనలు పక్కన పెట్టేశాడు. ఇప్పుడు మరోసారి దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నాడట ఈ స్టార్ కమెడియన్. అయితే కూడా ఓటీటీ కోసమని తెలుస్తోంది. డిజిటల్ ఇండస్ట్రీ హవా పెరగడంతో ఓటీటీ సంస్థలు ఒరిజినల్ కంటెంట్ కోసం చూస్తున్నాయి. ఈ క్రమంలో ‘ఆహా’ సంస్థ వెబ్ సిరీస్, వెబ్ సినిమాలను ప్లాన్ చేస్తోంది.

ఇప్పుడు ఆహా కోసం వెన్నెల కిషోర్ ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడని.. లిమిటెడ్ బడ్జెట్ లో, కొత్త నటీనటులతో ఈ ప్రాజెక్ట్ ను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో కిషోర్ కూడా కీలకపాత్ర చేస్తాడని అంటున్నారు. అయితే ఇది వెబ్ సిరీసా..? లేక సినిమానా అనే విషయంలో స్పష్టత రావాల్సివుంది. మరి ఈ ప్రాజెక్ట్ తోనైనా దర్శకుడిగా హిట్ అందుకుంటాడేమో చూడాలి!

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus