Venu Swamy, Jr NTR: ఎన్టీఆర్ జాతకం గురించి వేణుస్వామి షాకింగ్ కామెంట్స్.. ఏం చెప్పారంటే?

ఈ మధ్య కాలంలో ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సలార్ విషయంలో ఆయన అంచనాలు తప్పడంతో చాలామంది వేణుస్వామిని ట్రోల్ చేస్తున్నారు. అయితే వేణుస్వామి మాత్రం తాను చెప్పింది నిజమేనని తన జాతకం ఎప్పుడూ రాంగ్ కాలేదని చెబుతున్నారు. అయితే వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న వేణుస్వామి జూనియర్ ఎన్టీఆర్ జాతకం గురించి షాకింగ్ కామెంట్లు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కు తన కెరీర్ విషయంలో తనపై తనకు నమ్మకం ఉందని పొలిటికల్ గా కంటే సినిమాల పరంగా కలిసొస్తుందని తారక్ భావిస్తున్నారని వేణుస్వామి అన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో జూనియర్ ఎన్టీఆర్ తల్లిగారితో నేను మాట్లాడానని ఆ సమయంలో ఆమె నన్ను ఒక ప్రశ్న అడిగారని వేణుస్వామి వెల్లడించారు. మా వాడి జాతకంలో సమస్య ఉంది అది చెప్పకుండా మా వాడి జాతకాలు బాగా చెబుతున్నారని జూనియర్ ఎన్టీఆర్ తల్లి తనతో అన్నారని వేణుస్వామి పేర్కొన్నారు. ఆ సమయంలో ఆ సమస్య ఏంటో నాకు తెలుసు ఇదీ సమస్య అని నేను ఆమెకు చెప్పానని ఆయన చెప్పుకొచ్చారు.

సీనియర్ ఎన్టీఆర్ కు, నాకు, జూనియర్ ఎన్టీఆర్ కు తప్ప ఈ విషయం ఎవరికీ తెలియదని మీకు ఎలా తెలుసని ఆమె నన్ను అడిగారని వేణుస్వామి కామెంట్లు చేశారు. నాకు తెలుసమ్మా అని నేను సమాధానం ఇచ్చానని వేణుస్వామి పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ది మఖ నక్షత్రం అని ఆయన మంచి యోగంలో పుట్టారని వేణుస్వామి తెలిపారు.

2030 వరకు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకూడదని ఎన్టీఆర్ తల్లికి సూచనలు చేశానని (Venu Swamy) వేణుస్వామి పేర్కొన్నారు. కేటీఆర్, లోకేశ్ లకు సీఎం అయ్యే యోగం అయితే లేదని ఆయన కామెంట్లు చేశారు. లోకేశ్ ఎమ్మెల్యేగా గెలవవచ్చని వేణుస్వామి అన్నారు. ఎన్టీఆర్ జాతకం గురించి వేణుస్వామి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus