Aadhi, Nikki: ప్రేమ అనే పిచ్చి మూర్ఖత్వంతో పెళ్లి చేసుకుంటున్నారు.. వేణు స్వామి కామెంట్స్ వైరల్?

ఆస్ట్రాలజర్ వేణుస్వామి గత కొంత కాలం నుంచి సినీ సెలబ్రిటీల జాతకాలను చెబుతూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత విషయంలో ఈయన చెప్పిన జాతకం కరెక్ట్ కావడంతో ఆయన ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు.ఈ క్రమంలోనే అప్పటి నుంచి ప్రముఖ సెలబ్రిటీల జీవితాల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే నయనతార రష్మిక వంటి సెలబ్రిటీల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన వేణుస్వామి తాజాగా హీరో ఆది పినిశెట్టి దంపతుల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్నటువంటి ఆది నిక్కీ గత నెల 18వ తేదీ ఎంతో ఘనంగా వివాహం జరుపుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక వారి జీవితంలో కొత్త అధ్యయనాన్ని ప్రారంభించిన తరుణంలో వేణు స్వామి వీరి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే అది నక్షత్రం ఆశ్లేషమని, వీరిద్దరి జాతకాలు పోల్చి చూసినప్పుడు షష్టాష్టకాలు అయ్యాయని వేణు స్వామి తెలిపారు.

ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత వీరిద్దరికీ సమస్యలు వస్తాయని ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు. వారి ఇద్దరి జాతకం నాకు తెలుసు కనుక వారి గురించి చెబుతున్నాను నేను వారిని విడి పొమ్మని చెప్పడం లేదు కలిసి ఉండే ప్రయత్నాలు చేయాలని చెబుతున్నాను అంటూ తెలిపారు. అయితే ఎవరి జాతకంలో అయితే షష్టాష్టకాలు వస్తాయో అలాంటి వారు పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అని తెలిపారు.

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ప్రేమ అని పిచ్చి మూర్ఖత్వంతో పెళ్లిళ్లు చేసుకుంటున్నారని అనంతరం సమస్యలను ఎదుర్కొని విడిపోతూ సమాజానికి ఏం సమాధానం చెబుతారు అంటూ ఆయన ప్రశ్నించారు. ఇలా పెళ్లికి ముందు జాతకాల పరంగా విశ్లేషణ చేసుకొని దోషాలకు పరిహారం చేసుకుంటే మంచిదని వేణు స్వామి ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus