Venu Swamy: ఆ విమర్శలపై రియాక్ట్ అయిన వేణుస్వామి.. తప్పు చేస్తే చెప్పాలంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తరచూ తన వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచే జ్యోతిష్కులలో వేణుస్వామి ఒకరు. ప్రభాస్ వ్యక్తిగత జీవితం గురించి, సినిమాల గురించి చేసే కామెంట్ల ద్వారా వేణుస్వామి ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. చాలామంది రాజకీయ నేతలు, సెలబ్రిటీల విషయంలో తన అంచనాలు నిజమవుతున్నాయని వేణుస్వామి ఆధారాలతో సహా చూపిస్తుండగా ఆయన చెప్పిన విషయాల్లో కొన్ని మాత్రం నిజం కాలేదని నెటిజన్లు చెబుతున్నారు. గతంతో పోల్చి చూస్తే సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం జరుగుతోందని వేణుస్వామి వెల్లడించారు.

నన్ను కావాలని టార్గెట్ చేసి నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారని వేణుస్వామి చెప్పుకొచ్చారు. నా జాతకాలు నిజం కాదని పబ్లిసిటీ చేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు. కవిత అరెస్ట్ గురించి నేను చాలా రోజుల క్రితమే చెప్పానని వేణుస్వామి అభిప్రాయపడ్డారు. నా గురించి ట్రోల్స్, వీడియోలు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే కొందరు జ్యోతిష్కులు నా గురించి చెడు ప్రచారం చేసినట్టు నా దృష్టి వచ్చిందని వేణుస్వామి అన్నారు.

నేను జ్యోతిష్యం పరంగా తప్పులు చేస్తే మాత్రమే విమర్శించే అధికారం జ్యోతిష్కులకు ఉంటుందని చాలామంది జ్యోతిష్కులు నా సన్నిహితులే అని కొందరు మాత్రమే విమర్శలు చేస్తున్నారని వేణుస్వామి పేర్కొన్నారు. మీవి సాంప్రదాయంతో ఉండే సౌందర్య (Soundarya) లాంటి సినిమాలు అయితే నాని సన్నీలియోన్ (Sunny Leone) లాంటి సినిమాలు అని వేణుస్వామి వెల్లడించడం గమనార్హం. నా హ్యాబిట్స్ గురించి అందరికీ తెలుసని నాలోని మరో యాంగిల్ చూడాలని అనుకోవద్దని వేణుస్వామి పేర్కొన్నారు.

వేణుస్వామి చేసిన కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. వేణుస్వామి సోషల్ మీడియా వేదికగా వీడియోను షేర్ చేయగా ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. తాను తప్పు చేస్తే చెప్పాలని తాను చేసింది నిజంగా తప్పైతే అంగీకరిస్తానని వేణుస్వామి అన్నారు. వేణుస్వామి తనపై వచ్చిన విమర్శలకు ఘాటుగా జవాబిచ్చారు.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus