స్వయంవరం సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు నటుడు తొట్టెంపూడి వేణు.ఇలా స్వయంవరం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అనంతరం పలు సినిమాలలో హీరోగా నటించడమే కాకుండా మరికొందరి హీరోల సినిమాలలో సపోర్టింగ్ పాత్రలలో కూడా నటించారు. ఈ విధంగా తొట్టెంపూడి వేణు గతంలో పలు వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఈ విధంగా తాను ఇండస్ట్రీకి దూరంగా అవడానికి గల కారణాలను కూడా ఈయన వెల్లడించారు.
తన కుటుంబ వ్యాపార రంగంలో ఉండటం వల్ల వ్యాపారాలు చేసుకుంటూ సినిమాకి దూరమయ్యానని అయితే కరోనా సమయంలో ఇంట్లోనే కూర్చుని వెబ్ సిరీస్ లో చూడటం వల్ల తనకు తిరిగి నటనపై ఆసక్తి కలిగిందని ఈ సందర్భంగా వెల్లడించారు.ఇలా నటనపై ఆసక్తి రావడంతో చాయ్ బిస్కెట్ సంస్థ నుంచి తనకు ఒక అవకాశం వచ్చిందని దాని తర్వాత రామారావు ఆన్ డ్యూటీ సినిమా అవకాశం వచ్చిందని తెలిపారు. మొదట్లో ఈ సినిమాలో చేయకూడదని అనుకున్నాను కాకపోతే మాస్ మహారాజా రవితేజ వంటి వారి సినిమాతో రీ ఎంట్రీ ఇస్తే తాను ఇండస్ట్రీ లోకి రీఎంట్రీ ఇచ్చాననే విషయం అందరికీ తెలుస్తుందని ఈ సినిమాకి ఒకే చెప్పాను.
ఇకపోతే నేను ఇది వరకే పోలీస్ పాత్రలో నటించిన ఈ తరహా పాత్రలో చేయలేదని ఇందులో తన పాత్ర ఎంతో అద్భుతంగా ఉందని తెలిపారు. అదేవిధంగా మొదటిసారి ఈ సినిమాలో తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం తనకి ఎంతో సంతోషంగా ఉందని ఇలా సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం వల్ల తన పాత్రను 100% వోన్ చేసుకోగలుగుతున్నానని వేణు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇకపోతే ఈయన మాట్లాడుతూ తనకి మల్టీ స్టారర్ సినిమాలలో చేయడం చాలా ఇష్టమని అందుకే హనుమాన్ జంక్షన్ సినిమాలో తాను నటించానని తెలిపారు.
ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అతడు సినిమాలో తనకు సోను సూద్ పాత్రలో నటించే అవకాశం కల్పించారు. అయితే ఆ పాత్రను నేను వద్దనుకోవడంతో ఆ అవకాశం సోను సూద్ కి వెళ్లిందని ఆయన కెరియర్ లోనే ఇదొక మెమొరబుల్ పాత్ర అని చెప్పాలి అంటూ ఈ సందర్భంగా తాను మిస్ చేసుకున్న అవకాశం గురించి వెల్లడించారు. మొత్తానికి తొట్టెంపూడి వేణు రవితేజ సినిమా ద్వారా ఇండస్ట్రీకు రీ ఎంట్రీ ఇస్తూ మరోసారి తన అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. ఇక ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Most Recommended Video
ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!