టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి కొద్దిరోజులుగా ఎక్కువ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగు సినిమా పరిశ్రమ నుండి ఈ విషయం పై స్పందించిన వారు కానీ, చంద్రబాబు అరెస్ట్ ను ఖండించి మద్దతు పలికిన వారు ఎక్కువ మంది లేరు. కె.రాఘవేంద్ర రావు, అశ్వినీదత్ లు మాత్రమే చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ మద్దతు పలికారు. తాజాగా నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుని ఈ విషయంపై స్పందించగా…
ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ రాజకీయ అంశాల్లో స్పందించదు అంటూ చెప్పి షాకిచ్చారు. అంతేకాదు.. “మద్రాస్ లో చిత్ర సీమ ఉన్నప్పుడు.. ఆ తర్వాత హైదరాబాద్ కి షిఫ్ట్ అయిన టైంలో ఎన్టీఆర్, చెన్నారెడ్డి ఎంతో సపోర్ట్ చేసారని.. వ్యక్తిగతంగా ఏమైనా స్పందించాలి అనుకుంటే అది ఎవరి ఇష్టం వారిది.. సినీ పరిశ్రమ ఈ విషయంలో స్పందించకపోవడమే మంచిదని” ఆయన చెప్పారు. ఈ కామెంట్స్ పై సురేష్ బాబు విమర్శలు ఎదుర్కొంటున్నారు.
గతంలో ఆయన తండ్రి, రామానాయుడు గారు టీడీపీ నుండి ఎంపీగా చేశారు. అలాంటిది సురేష్ బాబు ఇలా అనడం ఏంటని.. విమర్శిస్తున్నారు. అయితే మరోపక్క సీనియర్ హీరో వేణు చంద్రబాబు అరెస్ట్ పై స్పందించి ..” అందరూ ఎందుకు స్పందించలేదో నాకు తెలీదు. నా వరకు చంద్రబాబు అరెస్ట్ అనేది కక్ష్య సాధింపు చర్య వంటిది. నాకు చాలా బాధగా ఉంది. గొప్పవాళ్ళకి ఒక్కోసారి ఇలాంటి పరిస్థితులు తప్పవు.
సీతమ్మ తల్లికే తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు కి కూడా ఇది ప్రూవ్ చేసుకోవాల్సిన టైం అయ్యుండొచ్చు” అంటూ (Venu) వేణు తన ‘అతిథి’ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో చెప్పుకొచ్చారు. దీంతో ‘సురేష్ బాబు కంటే కూడా సీనియర్ హీరో వేణు చాలా బెటర్ అని, టాలీవుడ్ హీరోల్లో ఇతనొక్కడే చంద్రబాబు గురించి పాజిటివ్ గా మాట్లాడారని’ నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు.
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!