Devara: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఫిక్స్ అయిందా.. అక్కడే చేయనున్నారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) , కొరటాల శివ  (Koratala Siva) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర (Devara) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 21 లేదా 22 తేదీలలో జరగనుందని తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో ఈ సినిమా ఈవెంట్ జరిగే ఛాన్స్ ఉందని భోగట్టా. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతులు లభిస్తే కర్నూలులోనే దేవర ఈవెంట్ జరుగుతుందని చెప్పవచ్చు. అనుమతులు రాకపోతే మాత్రం హైదరాబాద్ లో ఈవెంట్ జరిగే ఛాన్స్ ఉంటుంది.

Devara

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు సీడెడ్ లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది. తారక్ సినిమాలు సీడెడ్ లో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రికార్డ్ స్థాయిలో అభిమానులు హాజరు కావచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. దేవర ఈవెంట్ లో ఈ సినిమాకు సంబంధించిన మరో ట్రైలర్ విడుదలవుతుందేమో చూడాలి.

దేవర తెలుగు వెర్షన్ ట్రైలర్ కు ఇప్పటివరకు ఏకంగా 38 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ట్రైలర్ వ్యూస్ పరంగా దేవర సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్న నేపథ్యంలో కలెక్షన్ల విషయంలో సైతం సరికొత్త రికార్డులు క్రియేట్ కావాలని అభిమానులు ఫీలవుతున్నారు. దేవర సినిమా ఐదు భాషల్లో థియేటర్లలో విడుదల కానుండటం గమనార్హం. దేవర సినిమా బిజినెస్ విషయంలో నిర్మాతలు సంతృప్తితో ఉన్నారు.

దేవర సినిమా ఎన్టీఆర్ కెరీర్ కు కీలకమైన సినిమా కాగా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ కావడం పక్కా అని చెప్పవచ్చు. దేవర1 బ్లాక్ బస్టర్ హిట్టైతే దేవర2 సినిమాను మరింత భారీ లెవెల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించే అవకాశాలు ఉంటాయి. దేవర ట్రైలర్ కు ఇతర భాషల ప్రేక్షకుల నుంచి మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోంది. క్రిటిక్స్ నుంచి ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.

పాన్‌ ఇండియా సినిమా వస్తోంది.. మీరు ఆగండి.. నిజమేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus