పబ్లిక్ ప్లేసుల్లో నటీనటులు ఒంటరిగా కనిపిస్తే వెంటనే జనాలు గుమికూడతారు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సెల్ఫీ అంటూ, ఫోటో అంటూ.. వారి ప్రైవసీకి భంగం కలిగిస్తారు. మొన్నటికి మొన్న నయనతార తన భర్తతో కలిసి ఓ ట్రైన్లో ప్రయాణిస్తుంటే అక్కడున్న ఆకతాయి మూక నయన్ ను తన భర్త ముందే తాకడమే కాకుండా… ఆమె ఫోటోలు తీసి తన ప్రైవసీకి భంగం కలిగించారు. నయన్ వంటి స్టార్లే కాదు బుల్లితెర నటీమణులు కూడా ఇందుకు అతీతం ఏమీ కాదు.
తాజాగా ఓ సీరియల్ నటి (Actress) మార్కెట్ కు వెళ్తే.. అక్కడ కొంతమంది ఆమెను చుట్టుముట్టి అభ్యంతరకరంగా తాకారని చెప్పి అసహనం వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే.. షెఫాలీ షా అనే బుల్లితెర నటి ఏఎన్ఎ ప్యాడ్ క్యాస్ట్ ద్వారా తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి వెల్లడించింది. ‘గతంలో నేను బాగా రద్దీగా ఉన్న ఓ మార్కెట్ లోకి నడుచుకుంటూ వెళ్లాను. ఎవరో నన్ను చెప్పుకోకుడని ప్లేస్ లో తాకారు.
ఈ విషయం ఎక్కడైనా చెప్పుకుంటే సిగ్గుచేటు అని భావించి నేను ఎక్కడా చెప్పలేదు. గిల్టీ అని కాదు నిజంగా మనకు అది సిగ్గుచేటు. ఇలాంటి ఘోరమైన సంఘటనలు చాలా మందికి ఎదురై ఉండొచ్చు. ఇలాంటి వాటికి చెక్ పెట్టాల్సిన బాధ్యత మనపై ఉంది. మహిళలకు ఇప్పటికీ అలాంటి పరిస్థితి ఎదురవుతుంది అంటే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది’ అంటూ షెఫాలీ షా చెప్పుకొచ్చింది.
రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!