ప్రముఖ సినీ నటుడు, రచయిత అయిన గిరీష్ కర్నాడ్(81) మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు గిరీష్. అయితే ఈ ఉదయం ఆయనకు హఠాత్తుగా గుండె పోటు రావడంతో.. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఈ లోపే అయన మరణించారు. 1938 మే నెల 19న మహారాష్ట్రలో మథేరాలో జన్మించారు గిరీష్. తండ్రిపేరు రఘునాధ్ కార్నాడ్, తల్లి కృష్ణాబాయి. ఈ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే…!
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’, విక్టరీ వెంకటేష్ నటించిన ‘ధర్మచక్రం’, కింగ్ నాగార్జున నటించిన ‘రక్షకుడు’ వంటి చిత్రాల్లో నటించారు. కన్నడసాహిత్యానికి కన్నడ చలనచిత్రరంగానికి ఈయన చేసిన సేవలను గుర్తించి కర్నాటక విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ఇచ్చి గిరీష్ కర్నాడ్ ని సత్కరించారు. అంతేకాదు పద్మశ్రీ, పద్మభూషణ, జ్ఞానపీఠ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను కూడా అందుకున్నారు గిరీష్.