ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో వరుసగా సెలబ్రిటీలు పలు సమస్యల కారణంగా మరణిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు మహమూద్ మరణించడంతో ఒక్కసారిగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. జూనియర్ మెహమూద్ ఈరోజు తెల్లవారుజామున తన నివాసంలో కన్నుమూశారు. మెహమూద్ గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఇలా గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నటువంటి ఈయన నేడు ఉదయం మరణించారు. ఈయన క్యాన్సర్ తో బాధపడుతున్నటువంటి సమయంలో కీమోథెరపీ అందించారు.
క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ లో ఉన్న సమయంలో తనని ఇంట్లోనే ఉంచి సరైన చికిత్సను అందించారు అయితే నేడు ఉదయం రెండు గంటల సమయంలో ఈయన మరణించారని తెలుస్తుంది. జూనియర్ మెహమూద్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈయన అసలు పేరు నయీమ్ సయ్యద్. మొహబ్బత్ జిందగీ హై (1966)లో జూనియర్ మెహమూద్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఈయనకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.
మెహమూద్ (Junior Mehmood) నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ సుమారు 250కి పైగా సినిమాలలో నటించారు. మేరా నామ్ జోకర్, పర్వరిష్, కతి పతంగ్, ధో ఔర్ దో పాంచ్, మాఫియా వంటి చిత్రాలలో నటించి ఈయన నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈయన మరణ వార్త తెలిసిన బాలీవుడ్ సెలబ్రిటీలు ఈయనకు సంతాపం తెలియజేస్తున్నారు.