సినీ పరిశ్రమలో విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా.. పక్క భాషల్లోని సినీ సెలబ్రిటీలు కూడా మరణిస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా వయోభారంతో మరణించే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించేవారు కూడా చాలామందే ఉంటున్నారు. తాజాగా కోలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో ఓ సీనియర్ నటుడు కన్నుమూశాడు. వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ సీనియర్ నటుడు శంకరన్ నిన్న గుండెపోటుతో మరణించారు.
ఈయన దర్శకుడిగా కూడా పలు సినిమాలు చేశారు. సడన్ గా గుండెపోటు రావడంతో ఆయన ప్రాణం విడిచినట్టు తెలుస్తుంది. చెన్నైలోని ఆయన నివాసంలోనే ఈ విషాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. శంకరన్ వయసు 93 ఏళ్ళు. చాలా కాలంగా ఆయన వయోభారంతో ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. ఈయన మరణవార్తను సీనియర్ స్టార్ దర్శకుడు భారతీరాజా వెల్లడించాడు. ఆయన ట్విట్టర్ ద్వారా శంకరన్ మరణవార్తపై స్పందిస్తూ..’శంకరన్ మరణవార్త నన్ను ఎంతగానో బాధిస్తోంది.
ఆయన (Ra Sankaran ) కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తున్నాను’ అంటూ తన బాధను వ్యక్తం చేశారు. ఇక శంకరన్ సినిమా కెరీర్ ను గమనిస్తే.. ఆయన దాదాపు 30 సినిమాల్లో నటించారు. అలాగే 8 చిత్రాలకు దర్శకత్వం వహించారు. కార్తీక్, రేవతి జంటగా నటించిన మౌన రాగం చిత్రంలో హీరోయిన్ తండ్రి పాత్రలో శంకరన్ నటించారు. ఇక ఇండస్ట్రీ గొప్ప నటుడిని కోల్పోయింది అంటూ కోలీవుడ్ ప్రేక్షకులు కూడా కామెంట్లు పెడుతున్నారు.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!