సీనియర్ హీరోయిన్ అర్చన షాకింగ్ కామెంట్స్ వైరల్..!

సాధారణంగా హీరోయిన్లు గ్లామర్ షో చేస్తున్నంత సేపు మాత్రమే క్రేజ్ లో ఉంటారు.. లేకపోతే త్వరగానే ఫేడౌట్ అయిపోతుంటారు అని చాలా మంది అంటుంటారు. ఆ మాట అన్ని విధాలుగా కరెక్ట్ అని చెప్పలేము. గ్లామర్ షోకి దూరంగా ఉండి.. స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అనుభవించిన హీరోయిన్లు మన టాలీవుడ్లో చాలా మందే ఉన్నారు. అయితే కొంతమంది ట్యాలెంటెడ్ హీరోయిన్లు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఎక్కువ కాలం రాణించలేరు.

త్వరగానే వారు ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు. బహుశా వాళ్ళది బ్యాడ్ టైం అనుకోవాలేమో.సరే ఈ విషయం ఎందుకు చెబుతున్నాను అంటే.. అలనాటి హీరోయిన్ అర్చన.. తెలుగు ప్రేక్షకులకు ‘నిరీక్షణ’ అనే చిత్రంతో పరిచయమైంది. భానుచందర్ హీరోగా నటించిన ఈ చిత్రానికి బాలు మహేంద్ర దర్శకుడు. ‘నిరీక్షణ’ చిత్రం మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. హీరోయిన్ అర్చనకు కూడా మంచి గుర్తింపే లభించింది. తరువాత కూడా ‘లేడీస్ టైలర్’ వంటి సూపర్ హిట్ సినిమాలో నటించింది. అయితే 3 ఏళ్ళకే టాలీవుడ్ కు ఈమె దూరమయ్యింది.

దీనికి గల కారణాలు ఏంటి అన్నది ఎవ్వరికీ తెలియదు.అయితే ఇన్నాళ్టికి ‘అలీతో సరదాగా’ షోలో సందడి చేసింది ఈ సీనియర్ నటి.ఈ క్రమంలో ‘నిరీక్షణ’ చిత్రం గురించి కూడా స్పందించింది. ‘ఆ చిత్రంలో పాత్ర డిమాండ్ మేరకు జాకెట్ లేకుండా నటించినట్టు చెప్పుకొచ్చింది. ట్రైబల్ మహిళ పాత్రలో నటించడం వలన జాకెట్ లేకుండా నటించాను.అలా అని అది బోల్డ్ పాత్ర అని చెప్పలేము.కానీ నాకు మా మాత్రం ఆ పాత్ర మంచి పేరుతెచ్చిపెట్టింది’ అంటూ చెప్పుకొచ్చింది అర్చన.


ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus