సినీ పరిశ్రమలో విషాదాల పెరుగుతూనే ఉంది తప్ప అస్సలు తగ్గడం లేదు అనే చెప్పాలి. నిత్యం ఎవరో ఒకరు ఏదో ఒక సమస్య వల్ల మరణిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది చూసుకుంటే..టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తండ్రి, అలాగే స్టార్ నటుడు నాజర్ తండ్రి, శరత్ బాబు, చంద్రమోహన్ వంటి వారు మరణించారు. టాలీవుడ్లోనే కాకుండా పక్క రాష్ట్రాల సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా నిత్యం ఏవో ఒక కారణాల వల్ల మృత్యువాత చెందుతున్నారు.
బాలీవుడ్ నటి భైరవి , విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు కూడా మరణించడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరో సీనియర్ నటి కూడా కన్నుమూసినట్టు తెలుస్తుంది. ఆమె కూడా పక్క ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే..! వివరాల్లోకి వెళితే.. కన్నడ సీనియర్ నటి అయిన లీలావతి ఈరోజు కన్నుమూసినట్టు తెలుస్తుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్న ఈమె బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ వస్తున్నారు.
ఈమె కన్నడంతో పాటు తెలుగు, తమిళ , మలయాళ భాషల్లో తెరకెక్కిన సినిమాల్లో కూడా నటించారు అని తెలుస్తుంది. మొత్తంగా లీలావతి 600 కి పైగా సినిమాల్లో నటించారట. తెలుగులో అయితే ‘మర్మయోగి’ ‘కార్తీక దీపం’ ‘ఇది కథ కాదు’ ‘వాల్మీకి’ ‘మలుపు’ వంటి సినిమాల్లో నటించారు. నిర్మాతగా కూడా ఈమె పలు సినిమాలను రూపొందించారు. అలాగే కొన్ని సినిమాలకి గాను అవార్డులు కూడా అందుకున్నట్టు తెలుస్తుంది. ఇక లీలావతి గారు (Leelavathi) వయస్సు 87 ఏళ్లు అని తెలుస్తుంది.