సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా మంజు వారియర్ (Manju Warrier) హీరోయిన్ గా టి.జె.జ్ఞానవేల్ (T. J. Gnanavel) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వేట్టయన్- ది హంటర్’ (Vettaiyan) . దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది కానీ బాక్సాఫీస్ వద్ద మెరుపులు అయితే మెరిపించలేదు. తమిళంలో పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ వచ్చినా తెలుగులో బ్రేక్ ఈవెన్ కి చాలా కష్టపడుతుంది ఈ చిత్రం.
ఒకసారి (Vettaiyan) 11 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 3.99 cr |
సీడెడ్ | 1.60 cr |
ఉత్తరాంధ్ర | 1.10 cr |
ఈస్ట్ | 0.52 cr |
వెస్ట్ | 0.41 cr |
గుంటూరు | 0.54 cr |
కృష్ణా | 0.71 cr |
నెల్లూరు | 0.35 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 9.22 cr |
‘వేట్టయన్’ కి రూ.10.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 11 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.9.22 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కి మరో రూ.1.78 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకుంది. కానీ ఆశించిన స్థాయిలో కాదు.