Venkatesh, Kamal Hassan: ‘విక్రమ్’ కోసం వెంకీమామ!

లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘విక్రమ్’. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లాంటి తారలు ముఖ్య పాత్రలు పోషించారు. అలానే సూర్య క్యామియో రోల్ లో కనిపించనున్నారు. దీంతో సినిమాపై బజ్ పెరిగింది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. తెలుగులో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

దాదాపు 400 స్క్రీన్ లలో సినిమా విడుదల కాబోతుంది. దీంతో తెలుగులో కూడా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. రేపు ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో ఈవెంట్ జరగనుంది. దీనికోసం కమల్ హాసన్ హైదరాబాద్ రానున్నారు. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా విక్టరీ వెంకటేష్ రాబోతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. మొత్తానికి కమల్ కోసం వెంకీమామ రాబోతున్నారన్నమాట.

ఇటీవల వెంకీ నటించిన ‘ఎఫ్3’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం వెంకీ నెట్ ఫ్లిక్స్ కోసం ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేశారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus