Venkatesh Son: హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న వెంకటేష్ తనయుడు

టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఒక్క ఫ్యామిలీ అనే కాదు వెంకటేష్ అన్ని రకాల పాత్రలు చేస్తూ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా నిలిచాడు. వివాదాలకు, విమర్శకులకు దూరంగా ఉంటూ తన పని తాను తాను చూసుకుంటూ అందరివాడయ్యాడు. ప్రస్తుతం తన ఏజ్ కి తగ్గ పాత్రలు చేస్తూ అభిమానులని అలరిస్తున్నాడు.

ఇక అవకాశం ఉండాలే గాని మల్టి స్టారర్ సినిమాలు చేయడానికి ముందే ఉంటాడు. ప్రస్తుతం సాఫీగా సాగిపోతున్న వెంకటేష్ దగ్గుపాటి అభిమానులకి ఒక శుభవార్త చెప్పనున్నాడని తెలుస్తుంది. తన కొడుకు అర్జున్ ని సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వెంకటేష్ కి అర్జున్ అనే కొడుకు ఉన్నాడనే సంగతి మనందరికి తెలిసిందే. అర్జున్ కి ఇప్పుడు 18 ఏళ్ల వయస్సు ఉంటుంది. అర్జున్ ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్నాడు. ఇక వెంకటేష్ కొడుకు అతి త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తాజాగా సమాచారం వచ్చింది.

అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా మెుత్తం పూర్తి అయ్యాయని తెలుస్తుంది. అందుకోసమని అర్జున్ దగ్గుపాటి మెుదటి చిత్రానికి ప్రముఖ స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడని సమాచారం. ఇప్పటికే ఒక అద్భుతమైన స్టోరీ.. అందరికి అన్నీవర్గాలకు నచ్చేటట్టు.. ఎంటర్టైన్మెంట్ తో కూడిన కథని సిద్దం చేసారని త్రివిక్రమ్ చెప్పాడు. అయితే ఆ కథ వెంకటేష్ కి ఎంతోగాను నచ్చింది. వచ్చే ఏడాది లోను అర్జున్ గ్రాండ్ డెబ్యూ మూవీ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

అయితే (Venkatesh) వెంకటేష్ గత ఏడాది F3 సినిమాతో అలాగే ఈ ఏడాది రానా నాయుడు వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ను మరిచిపోలేని విధంగా అలరింపచేసాడనే అనే విషయం అందరికి తెలిసిందే. ఈ రెండు సినిమాల తర్వాత వెంకటేష్ సూపర్ హిట్ సినిమా దర్శకుడు శైలేష్ తో సైంధవ్ అనే చిత్రాన్ని చిత్రీకరిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ సినిమా ఈ సంవత్సరం డిసెంబర్ లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి కొడుకుతో పోటీ పడడానికి వెంకటేష్ సిద్ధమయ్యాడని తెలుస్తుంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus