‘మహారాజ’ (Maharaja) వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా వచ్చిన చిత్రం ‘విడుదల 2’ (Vidudala Part 2) . 2024 డిసెంబర్ 20న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజే నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. 2023 లో వచ్చిన ‘విడుదల’ కి రెండో భాగంగా ఈ సినిమా రూపొందింది. మొదటి భాగం క్రిటిక్స్ నుండి మంచి అప్రిసియేషన్ దక్కించుకుంది.సెకండ్ పార్ట్ పై ఆసక్తి ఏర్పడేలా చేసింది. కానీ రెండో పార్ట్ నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
తమిళంలో బాగానే ఓపెనింగ్స్ వచ్చినా… తెలుగులో మొదటి రోజే చేతులెత్తేసింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 0.32 cr |
సీడెడ్ | 0.15 cr |
ఆంధ్ర(టోటల్) | 0.28 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 0.75 cr |
‘విడుదల 2’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.3.0 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్లో ఈ సినిమా కేవలం రూ.0.75 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఈ సినిమా మరో రూ.2.75 కోట్ల (షేర్) దూరంలో ఆగిపోయి డిజాస్టర్ గా మిగిలింది. 2024 లో ‘మహారాజ’ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ సేతుపతి.. అదే ఏడాది చివర్లో ‘విడుదల 2’ తో డిజాస్టర్ ను మూటగట్టుకున్నాడు.