సైలెంట్ గా ఓటీటీకి వచ్చేసిన మంచి సినిమా ‘విడుదల’

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కించే సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఆయన దర్శకత్వంలో ఇటీవల వచ్చిన చిత్రం ‘విడుద‌ల’(మొదటి భాగం). మే 26న ఈ సినిమాకు సంబంధించిన డైరెక్ట‌ర్స్ క‌ట్ స్ట్రీమింగ్ కాబోతోంది. అంటే థియేటర్ వెర్ష‌న్‌లో ప్రేక్ష‌కులు చూడ‌ని స‌న్నివేశాలు… ఈ డైరెక్ట‌ర్స్ క‌ట్‌లో ఉంటాయన్న మాట. విజయ్ సేతుపతి, సూరి, భవానీ శ్రీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్ వంటి వారు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 15న తెలుగులో రిలీజ్ అయ్యింది.

కుమరేశన్ అనే పోలీస్ కానిస్టేబుల్‌కి సంబంధించిన కథ ఇది. ఈ పాత్ర‌లో సూరి న‌టించారు. మిలిటెంట్ నాయ‌కుడు పెరుమాల్ (విజ‌య్ సేతుప‌తి)ను ప‌ట్టుకోవ‌టానికి వ‌చ్చిన పోలీసు బృందానికి డ్రైవ‌ర్‌గా కుమరేశన్ ప‌ని చేస్తుంటాడు. పెరుమాల్ ఓ ప్ర‌భుత్వ వ్య‌తిరేక సంస్థ‌ను స్థాపించి సాయుధ పోరాటం చేస్తుంటాడు. ఆయ‌న పోరాటం శాంతికి విఘాతాన్ని క‌లిగిస్తుందని పోలీసులు అతన్ని అరెస్ట్ చేయటానికి ప్రయత్నిస్తారు.

కుమరేశన్ సమాజంపై పాజిటివ్ దృక్ప‌థాన్ని క‌లిగి ఉంటాడు. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో చిన్న పోలీసుగా త‌న కెరీర్‌ను స్టార్ట్ చేస్తాడు. స‌మాజంలో మంచి, చెడుల గురించి తెలుసుకునే క్రమంలో కుమరేశన్‌కి ఆ ఆటవీ ప్రాంతంలో నివ‌సించే అమ్మాయి త‌మిళరసి (భ‌వానీ శ్రీ)తో ప్రేమ కలుగుతుంది. కానీ ఆమెను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు చేస్తున్న టైంలో కుమరేశన్ ఏం చేశాడు అన్నది మిగిలిన కథ. ‘విడుదల’ చిత్రంలో నైతిక విలువలు పాటించ‌కుండా మహిళలను చిత్ర హింసలు పెట్టే పోలీసుల క్రూర‌త్వాన్ని చూపించారు.

దీంతో పాటు 1990 ద‌శ‌కంలో త‌మిళ‌నాడు రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను కూడా ఇందులో చ‌ర్చించారు. కొన్ని సన్నివేశాలు చాలా ఘోరంగా ఉంటాయి. తెలుగులో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసినప్పుడు చాలా సన్నివేశాలు కట్ చేశారు. అయితే డైరెక్ట‌ర్స్ క‌ట్‌లో అక్కడ చూడని సన్నివేశాలు కూడా చూడొచ్చన్న మాట. ఓ రకంగా విడుదల టీం చేస్తున్నది మంచి ప్రయోగమనే చెప్పాలి. భవిష్యత్తులో ఓటీటీ రిలీజ్ లు ఈ రకంగా ఉంటే థియేటర్లో చూసిన వాళ్ళు కూడా ఇక్కడ రిపీట్స్ లో చూసే అవకాశం ఉంటుంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus