బాలీవుడ్ నటి విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. డర్టీ పిక్చర్ సినిమాతో దేశాన్ని ఓ ఊపు ఊపేసింది. సిల్క్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన సినిమాలో తాను అదరగొట్టేసింది. తను నటనతోనే కాకుండా తరచుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతుంది. ఇటీవల ఆమె ఓ విమానాశ్రయంలో కనిపించింది. ఈ సమయంలో తన పాటు ఓ అమ్మాయి కనిపించింది. కారు దిగిన తర్వాత విద్యాబాలన్ ఆ అమ్మాయిని కౌగిలించుకొని ఆమెతో పోజులిచ్చింది.
ఈ వీడియో చూసిన వారంతా షాక్ అవుతున్నారు. కొంతమంది యూజర్లు ఆమె విద్యాబాలన్ కూతురే అంటున్నారు.ఆమె తన పక్కనున్న అమ్మాయి పట్ల చూపించే ఆప్యాయతకు తన అభిమానులు మురిసిపోతున్నారు. ఈ వీడియో చూసిన అభిమానుల నుంచి కామెంట్స్ వెల్లువెత్తాయి. ఈ వీడియో చూసిన వారంతా ఆమెకు కూతురు ఎప్పుడు పుట్టిందో.. ఇప్పటి వరకు ఎందుకు దాచిపెట్టారో అర్థం కావట్లేదని ప్రశ్నిస్తున్నారు.
అయితే (Vidya Balan) విద్యాబాలన్‌కి కోడలు కావచ్చని కొందరు అంటున్నారు. విద్యాబాలన్ ‘మిషన్ మంగళ్’ తర్వాత ‘నియత్’ చిత్రంలో కనిపించింది. ఇది కాకుండా, నటి కూడా సోషల్ మీడియాలో తన అభిమానులతో కనెక్ట్ అవుతుంది. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలతో బాలీవుడ్ లో తనదైన ముద్ర వేసింది విద్యాబాలన్. కళ ముందు అన్నీ చిన్నవేనని తన నటన ద్వారా నిరూపించింది.