Nayanthara: నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది.. విగ్నేష్ ట్వీట్ వైరల్!

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె పెళ్లి తర్వాత కూడా అదే స్థాయిలో సినిమా అవకాశాలను అందుకుని దూసుకుపోతున్నారు. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో నయనతార చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటించారు. ఇకపోతే త్వరలోనే ఈమె జవాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం జవాన్. ఈ సినిమా ఇప్పటికీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ సినిమా ద్వారా నయనతార బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాలో నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో ఈమె కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని చేతిలో గన్ తో యాక్షన్ మూడ్ లో ఉన్నారు. ఇక ఈ పోస్టర్ విడుదల చేయడంతో తన భర్త విగ్నేష్ సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోని షేర్ చేస్తూ నయనతారపై ప్రశంసలు కురిపించారు. ఇలా ట్విట్టర్ వేదికగా నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేసిన విగ్నేష్ ఆమెను పొగుడుతూ ట్వీట్ చేశారు.

ఈ పోస్టర్ లో నయనతారని (Nayanthara) చూస్తుంటే చాలా గర్వంగా ఆనందంగా ఉందని తెలిపారు. షారుక్ ఖాన్ కి అభిమానిగా ఆయన సినిమాలన్నింటిని చూసిన నయనతార ఇప్పుడు తన సినిమాలోనే ప్రధాన పాత్రలో నటించడం చాలా గర్వంగా ఉందని తెలిపారు. నువ్వు ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నావు.నిన్ను చూస్తుంటే నేనొక్కడినే కాదు మన ఫ్యామిలీ మొత్తం ఎంతో గర్వంగా ఫీల్ అవుతుంది అంటూ నయనతార పట్ల ప్రశంసలు కురిపిస్తూ విగ్నేష్ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus