Vijay, Atlee: విజయ్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాపై ఇంట్రెస్టింగ్‌ ఇన్ఫో!

‘కప్పు ముఖ్యం బిగిలూ…’ ఈ మాట గుర్తుందా? ‘విజిల్‌’ సినిమాలో చిన్న విజయ్‌ను చూస్తూ పెద్ద విజయ్‌ అలియాస్‌ రాయప్పన్‌ చెప్పే మాట ఇది. సినిమా వచ్చాక ఈ మాట చాలా ఫేమస్‌ అయిపోయింది. చాలా విషయాల్లో ఆ మాట వాడేస్తున్నాం. అయితే ఈ సినిమాలో మరో డైలాగ్‌ కూడా ఉంది. అదే ‘చేసేస్తే పోలా..’ తెలుగులో పెద్ద హైలైట్‌ కాలేదు ఈ డైలాగ్‌ కానీ, తమిళంలో ‘సెంజిటా పోచు’ అనే మాట చాలా ఫేమస్‌ అయ్యింది. ఇప్పుడు అదే మాట ట్విటర్‌లో వైరల్‌ అవుతోంది.

‘బిగిల్‌’ సినిమా సీక్వెల్‌ కావాలంటూ చాలా రోజుల నుండి విజయ్‌ ఫ్యాన్స్‌ అట్లీని అడుగుతూనే ఉన్నారు. ఎందుకంటే ఆ సినిమాలో విజయ్‌ పాత్ర అంత అద్భుతంగా ఉంటుంది. నయనతార, విజయ్‌ కెమిస్ట్రీ కూడా అదిరిపోతుంది. అందుకే అలాంటి పాత్రలో దళపతిని చూద్దాం అని ఫ్యాన్స్ ఆశ. అయితే ఆ సినిమాలో రాయప్పన్‌ పాత్రకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ పాత్రలో విజయ్‌ చాలా సెటిల్డ్‌గా నటించాడని విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు కూడా.

ఇప్పుడు ఆ రాయప్పన్‌ పాత్ర ఆధారంగా ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఊహించండి అంటూ అమెజాన్‌ ప్రైమ్‌ ఇటీవల ఓ ట్వీట్‌ చేసింది. దానికి చాలామంది లైక్‌లు, కామెంట్లు పెట్టారు. దాంతో ఆ ట్వీట్‌ కింద పెద్ద చర్చే సాగుతోంది. అయితే ఆ ట్వీట్‌కి ‘బిగిల్’ దర్శకుడు అట్లీ ఇచ్చిన రిప్లై మొత్తం చర్చను అటువైపు తిప్పేసింది. అంతగా అట్లీ ఏం రాశాడు అనేగా మీ డౌట్. ఇంకేముంది సెంజిటా పోచు అన్నాడు… ‘చేసేస్తే పోలా’ అన్నాడు. దీంతో ఫ్యాన్స్‌ సందడి మామూలుగా లేదు.

విజయ్‌కి అలాంటి మాస్‌ మసాలా పాత్ర ఇప్పుడు చాలా అవసరం. వరుస విజయాలతో జోరు మీదున్న సమయంలో ‘బీస్ట్‌’ లాంటి ప్రయోగం చేశాడు విజయ్‌. కానీ సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. దీంతో వంశీ పైడిపల్లి సినిమా మీదకు కళ్లు వెళ్లాయి. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ కోసం అంటున్నారు. కాబట్టి మాస్ ఫ్యాన్స్‌ కోసం విజయ్‌ ఇప్పుడు ఈ సినిమా చేయాలి. అన్నట్లుగా లోకేశ్‌ కనగరాజ్‌ డైరక్షన్‌లో చేసే దళపతి67 కూడా మాస్ సినిమానే నట.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus