ప్రముఖ కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోని కుమార్తె మీరా ఆంటోని గత కొన్ని నెలల క్రితం ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా విజయ్ అంటోనీ కుమార్తె మీరా ఆత్మహత్యకు గల కారణాలు తెలియకపోయినా ఈమె మరణ వార్త మాత్రం తన కుటుంబ సభ్యులను ఎంతగానో కృంగదీసిందని చెప్పాలి. మీరా మరణ వార్త నుంచి బయటపడటం కోసం విజయ్ ఆంటోని అలాగే ఫాతిమా తమ సినిమా పనులలో బిజీ అవుతున్నప్పటికీ తన కూతురి మరణ వార్తను మాత్రం మర్చిపోలేకపోతున్నారని
ఇంకా ఆ వార్త నుంచి బయట పడలేకపోతున్నారని తెలుస్తుంది. తాజాగా ఈమె మరోసారి తన కుమార్తె మీరాను తలుచుకొని సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. ఈ సందర్భంగా ఫాతిమా తన కుమార్తె మీరాతో కలిసి దిగినటువంటి ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ మీరా, నీ పియానో నీ టచ్ లేక బాధపడుతుంది. నువ్వు లేవని మేము ఇంకా నమ్మలేకపోతున్నాం.
ఈ ప్రపంచం నీ కోసం కాదేమో. కానీ అమ్మ ఇంకా ఇక్కడే ఉంది. ఈ చావు బతుకుల మధ్య గీత నాకు అర్ధం కావట్లేదు. నిన్ను కలిసేదాకా బ్లాంక్ గానే ఉంటాను. నువ్వు అక్కడ ఉన్న బాగా తిని రెస్ట్ తీసుకో నిన్ను చాలా మిస్ అవుతున్నాము అంటూ ఈ సందర్భంగా తన కుమార్తెను తలుచుకొని మరోసారి ఈమె (Fathima) సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
విజయ్ ఆంటోని ఈ వార్త నుంచి బయటపడటం కోసం వరస సినిమాలకు కమిట్ అవుతూ బిజీగా ఉన్నారు. అలాగే ఫాతిమా కూడా నిర్మాణ పనులను చూసుకుంటూ బిజీగా ఉన్నప్పటికీ తన కుమార్తె మరణం వార్త మాత్రం వీరిని వెంటాడుతూనే ఉందని తెలుస్తుంది.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!