సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను చూస్తుంటే.. మనుషుల్లో మానవత్వం చచ్చిపోయిందా..? అనే ఆలోచన రాకమానదు. రీసెంట్ గా తమిళనాడులో సత్య అనే అమ్మాయి తనను ప్రేమించడం లేదనే కారణంతో సతీష్ అనే ప్రేమోన్మాది ఆమెని ట్రైన్ నుంచి తోసేసాడు. దీంతో ఆమె చనిపోయింది. ఈ ఘటనతో అందరూ షాక్ అయ్యారు. సత్య మరణించిన రెండురోజులకు ఆమె తండ్రి కూడా మరణించడంతో.. ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ‘బిచ్చిగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ కూడా స్పందించారు.
తన ట్వీట్ లో.. ‘సత్య తరపున నేను వేడుకుంటున్నాను. సత్య, ఆమె తండ్రి మరణానికి కారణమైన దుర్మార్గుడిని కఠినంగా శిక్షించండి. ఎప్పుడో పదేళ్ల తర్వాత విచారణ జరిపి ఉరితీయటం వంటి పనులు కాకుండా.. వెంటనే విచారణ జరిపి, సత్యను ఎలా చంపాడో అలాగే వాడిని కూడా ట్రైన్‌లో నుంచి తోసి చంపాలి. వాడికి కూడా అదే శిక్ష పడాలి. అప్పుడే న్యాయం జరగుతుంది’ అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చారు. సత్య అనే యువతి.. బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతుంది.
ఆమె ఇంటి దగ్గరుండే సతీష్ అనే యువకుడు ఆమెని ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు. సత్యకు ఇష్టంలేకపోయినా.. ఆమెని ప్రేమించమని వేధించేవాడు. ఈ విషయం గురించి సతీష్ తల్లిదండ్రులకు చెప్పినా.. ఫలితం లేకుండా పోయింది. సత్య ఒకరోజు లోకల్ ట్రైన్ లో వెళ్తుండగా.. ఆమె ఫాలో అవుతూ వెళ్లిన సతీష్ ప్రేమించమని గొడవపడ్డాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ట్రైన్ లోనుంచి కిందకి తోసేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ప్రస్తుతం సతీష్ పోలీసుల అదుపులో ఉన్నాడు.
சத்யாவை கொன்று சத்யாவின் அப்பாவின் தற்கொலைக்கு காரணமான சதிஷை, பொறுமையாக விசாரித்து 10 வருஷத்துக்கு அப்புறம் தூக்குல போடாமல், தயவு செய்து, உடனே விசாரித்து, ரயில்ல தள்ளி விட்டு தண்டிக்கும் படி, சத்யாவின் சார்பாக பொது மக்களில் ஒருவனாக, கனம் நீதிபதி அவர்களை கெஞ்சி கேட்டு கொள்கிறேன்🔴 pic.twitter.com/b8h5CPb4hg