Varasudu: ‘వారసుడు’ పార్టీకి వచ్చిన విజయ్‌.. ఓ రేంజిలో నెటిజన్లు!

‘వరిసు’ / ‘వారసుడు’ సినిమా హిట్‌ అయ్యిందా? లేదా? అనే విషయంలో క్లారిటీ అయితే లేదు కానీ.. సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ మాత్రం ఇటీవల జరిగాయి. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని నిర్మాత దిల్‌ రాజు ఇంట్లో కేకు కట్‌ చేసి మరీ వేడుకలు చేసుకున్నారు. ఈ వేడుకకు హీరో థళపతి విజయ్‌ హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దిల్‌ రాజు – విజయ్‌ మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ ఆ మధ్య వచ్చిన పుకార్లకు దీంతో ఫుల్‌స్టాప్ పడినట్లే అని చెబుతున్నారు.

అయితే ఇక్కడే ఇంకో ప్రశ్న సోషల్‌ మీడియాలో కనిపిస్తోంది. ‘వరిసు’ సినిమా ప్రచారం కోసం మ్యూజిక్‌ లాంచ్‌ ఈవెంట్‌కి వచ్చిన విజయ్‌.. ‘వారసుడు’ సినిమా ప్రచారం కోసం రాలేదు ఎందుకు? అంటూ గత కొన్ని రోజులుగా ప్రశ్నలు మీడియాలోను, సోషల్‌ మీడియాలోను కనిపిస్తున్నాయి. ఆ మధ్యో ప్రెస్‌ మీట్‌లో మీడియా ప్రతినిధులు దిల్‌ రాజును ఈ మాట అడిగేశారు కూడా. దానికి ఆయన సినిమా వాయిదా పడింది కదా.. వస్తే రావొచ్చు అని చెప్పారు. కానీ విజయ్‌ ప్రచారానికి రాలేదు. దీంతో సినిమాకు కాస్త ఇబ్బంది అయ్యిందనే చెప్పాలి.

హీరో ప్రచారానికి రాకుండా సినిమాను ప్రమోషన్స్‌లో ముందుకు తీసుకెళ్లాలంటే అంత ఈజీ కాదు. కానీ ‘వారసుడు’ విషయంలో అదే జరిగింది. ఫలితం నిర్మాత ఇప్పుడు ఫేస్‌ చేస్తున్నారనే చెప్పాలి. ప్రచారానికి రాని విజయ్‌.. ఇప్పుడు పార్టీకి ఎందుకు వచ్చారు అనేదే ఇక్కడ ప్రశ్న. ‘ప్రచారానికి నో చెప్పి.. పార్టీకి యస్‌ చెప్పారా’ అంటూ కొంతమంది ట్రోలర్స్‌ను దిల్‌ రాజును ప్రశ్నిస్తున్నారు. కాఫీ కప్‌తో ఎదురొచ్చి విజయ్‌ స్వాగతం పలికారు అంటూ గొప్పగా చెప్పారే..

ప్రచారానికి రాకపోతే ఎలా అంటూ ప్రశ్నలు వస్తే కవర్‌ చేసుకున్న దిల్‌ రాజు ఇప్పుడేం చేస్తారో చూడాలి. మరో విషయం ఏంటంటే.. ఈ వేడుకకు హీరోయిన్‌ రష్మిక మందన కూడా రాలేదు. ‘మిషన్‌ మజ్ను’ ప్రచారంలో భాగంగా బాలీవుడ్‌లో ఉంది అంటున్నారు అనుకోండి. అయితే ఆ రోజు ఏం ప్రచారం జరిగిందో తెలియదు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus