కుటుంబ సమస్యల కారణంగా విజయ్ ఆత్మహత్య
- December 11, 2017 / 08:05 AM ISTByFilmy Focus
‘బొమ్మరిల్లు, అబ్బాయిలు అమ్మాయిలు’ వంటి సినిమాల ద్వారా కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకొన్న విజయ్ అలియాస్ పొట్టి విజయ్. ఆ తర్వాత ‘వరప్రసాద్ పొట్టిప్రసాద్’లో హీరోగానూ నటించాడు. ఈమధ్యకాలంలో సరైన అవకాశాల్లేక వెనుకబడిన విజయ్ యూసఫ్ గూడలోని తన అపార్ట్ మెంట్ లో ఆత్మహత్య చేసుకొన్నాడని తెలుస్తోంది. కుటుంబ సమస్యలతో విజయ్ బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విజయ్, అతడి భార్యకు మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు.
వారికి ఒక పాప ఉంది. విడాకుల అనంతరం పాప భార్య సంరక్షణలోనే ఉంది. అయితే పాపను చూసేందుకు కూడా భార్య అనుమతించకపోవడంతో విజయ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ కారణంతోనే విజయ్ ఆత్మహత్యకు చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగులో పలు చిత్రాల్లో కమెడియన్‌గా నటించిన విజయ్ అందరి అభినందనలు అందుకున్నాడు. కాగా విజయ్ ఆత్మహత్యపై తెలుగు చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.














