“సినిమా ఇండస్ట్రీకి రాకముందు అలాంటి పాత్రలు చేయాలి.. ఇలాంటి సినిమాలు చేయాలి” అని చాలా ఊహించుకొన్నాను. ఆ ఆశయంతోనే ఇండస్ట్రీకి వచ్చాను. కానీ.. ఇక్కడికి వచ్చాక అర్ధమైంది. ఇక్కడ నచ్చింది చేయడం కాదు.. వర్కవుట్ అయ్యేవి చేయాలి. ప్రతీదీ బిజినెస్ ఇక్కడ. ప్రతీదీ లెక్కలోకి తీసుకోవాలి. ఏది వర్కవుట్ అవుతుంది, ఏది అవ్వదు అని బేరీజు వేసుకొని అప్పుడు అది ప్రయత్నించాలి. అప్పుడే నేను నెమ్మదించాను” అంటూ గోవా ఫిలిమ్ ఫెస్టివల్లో తన సినీ ప్రయాణం గురించి చెప్పుకొచ్చాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. దేవరకొండ మాటలు చాలా మందిని ఇన్స్పైర్ చేశాయి.
అదే సందర్భంలో తాను క్రిటిసిజమ్ ను ఎలా తీసుకొంటాను అనే విషయం గురించి మాట్లాడుతూ.. “డియర్ కామ్రేడ్ సినిమా రిలీజ్ అయ్యాక.. ఒక చిన్న పిల్ల నా దగ్గరకి వచ్చి ఫస్టాఫ్ బాగుంది కానీ.. సెకండాఫ్ బాలేదు” అని చెప్పింది. నా దృష్టిలో ఇది రియల్ క్రిటిసిజమ్. నా సినిమా బాలేదు అని చెప్తే.. నెక్స్ట్ సినిమా బాగుంది అని బాలేదు అన్నవాళ్లతో అనిపించడానికే ప్రయత్నిస్తాను. అదొక రివెంజ్ లాంటిది అన్నమాట. కానీ.. నాకు నచ్చింది మాత్రమే చేస్తాను.. నా సినిమా రిజల్ట్ ను బట్టి నా యాటిట్యూడ్ లో ఎలాంటి మార్పు ఉండదు” అని విజయ్ ఇచ్చిన స్పీచ్ కి ఆహుతులందరూ చెప్పట్లతో రెస్పాండ్ అవ్వడం గమనార్హం.
“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!