Vijay Devarakonda: ‘లైగర్’ సినిమాలో అమ్మాయిలతో విజయ్ దేవరకొండ ఫైట్!

  • July 25, 2022 / 06:34 PM IST

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘లైగర్’. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయబోతున్నారు. ఆగస్టు 25న ఈ సినిమా విడుదల కానుంది. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. బాలీవుడ్ లో కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఈ సినిమాను రిలీజ్ చేస్తుండడంతో అక్కడ బజ్ పెరిగింది. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ అంచనాలకు మించి ఉంది.

దీంతో సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు దర్శకనిర్మాతలు. ఈ సినిమాలో చాలా స‌ర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వాటిని థియేటర్లో చూసినప్పుడు ఫ్యాన్స్ కి పూనకాలే. వాటిలో ఓ ఫైట్ సీన్ ఉందట. దాదాపు 14 మంది అమ్మాయిలతో విజయ్ దేవరకొండ యాక్షన్ సీన్ ప్లాన్ చేశారు పూరి. ఈ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. ఆ 14 మంది అమ్మాయిలు మార్షల్ ఆర్ట్స్ లో నిపుణులని తెలుస్తోంది.

విదేశాల నుంచి వారిని తీసుకొచ్చాడట పూరి. ఈ ఒక్క ఫైట్ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చిందట. ప్రీ క్లైమాక్స్ కి ముంచు వచ్చే ఈ సీన్ మంచి బ్లాస్ట్ అవుతుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. అతడితో హీరో విజయ్ దేవరకొండ ఫైట్ చేసే సీన్ తో క్లైమాక్స్ పడుతుంది.

ఈ సన్నివేశాలు కూడా ఇంటర్నేషనల్ రేంజ్ లో చిత్రీకరించారని సమాచారం. వీటితో పాటు సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ చాలానే ఉన్నాయట. మొత్తానికి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ పెద్ద హిట్టు కొట్టేలానే ఉన్నాడు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus