యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) విషయంలో చాలా వివాదాలు ఉన్నాయి. ఆయన మాటలో, చేసిన కామెంట్సో, బాడీ లాంగ్వేజ్ విషయంలోనో.. ఇలా చాలా విషయాల్లో ఆయన చుట్టూ వివాదాలు తిరుగుతుంటాయి. దీంతో ఆయన చుట్లూ కాంట్రవర్శీ వైఫైలా తిరుగుతూ ఉంటుంది అనే కామెంట్లు వినిపిస్తుంటాయి. అయితే అందులో చాలా కాలం వినిపించన కాంట్రవర్శీ ఆయన పేరు ముందు ఆయన పెట్టుకు ‘ది’ ట్యాగ్. గతంలో ఓసారి ఈ వివాదాస్పద ట్యాగ్ గురించి మాట్లాడిన విజయ్ ఇప్పుడు మరోసారి రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
విజయ్ దేవరకొండ, అతని సోషల్ మీడియా టీమ్ అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటూ ఉంటుంది. సినిమాల విడుదల సమయాల్లోనే కాకుండా, సినిమాల గురించి ఎలాంటి అప్‌డేట్ లేనప్పుడు, విజయ్ పేరు పెద్దగా మీడియాలో చర్చలో లేనప్పుడు కూడా విజయ్ అండ్ టీమ్ సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. అలా ‘ది’ ట్యాగ్‌ను గురించి ఇప్పుడు విజయ్ మాట్లాడారు. ఈ వివాదం కారణంగా ఆయన ‘ది’ ట్యాగ్‌ను సినిమాల వరకు తొలగించిన విషయం తెలిసిందే. ట్విటర్ హ్యాండిల్ అయితే అదే ఉంది.
ఇక విజయ్ (Vijay Devarakonda) ఏమన్నాడో చూస్తే..‘‘నా పేరుకు ముందు ‘ది’ అనే ట్యాగ్ యాడ్ చేయడం వల్ల విపరీతమైన స్పందన వచ్చింది. దీని వల్ల ఇతర హీరోలెవరూ ఎదుర్కోనన్ని ఎదురుదెబ్బలు నాకు తగిలాయి. యూనివర్సల్ స్టార్ నుంచి పీపుల్స్ స్టార్ వరకు ఇలా ఎన్నో ట్యాగ్స్ ఉన్నాయి. నాకంటే చిన్నవారు, పెద్దవారు కూడా ఆ ట్యాగ్స్‌ను వాడారు, వాడుతున్నారు కూడా. కానీ నా విషయంలో ట్యాగ్ ఇబ్బందులు వచ్చాయి. ఇదంతా చూస్తుంటే ఏ ట్యాగ్ లేకుండా ఉన్న హీరో బహుశా నేను ఒక్కడినేనేమో అని అన్నాడు విజయ్.
నాకు ట్యాగ్‌లైన్‌తో గుర్తుండాలనే ఆసక్తి ఎప్పుడూ లేదని చెప్పిన విజయ్… ప్రేక్షకులు నన్ను నా నటనతో గుర్తుంచుకోవాలని కోరుకుంటానని చెప్పాడు. ఆడియన్స్ నన్ను సదరన్ సెన్సేషన్, రౌడీ స్టార్ లాంటి పేర్లతో పిలిచారు. వాటిని నేను అంగీకరించలేదు. దీంతో నా సినిమా ‘లైగర్’ ప్రచారంలో ఆ సినిమా టీమ్ ‘ది’ అనే పదాన్ని యాడ్ చేసింది. అప్పటివరకూ ఆ ట్యాగ్ ఎవరికీ లేకపోవడంతో నేనూ ఓకే చెప్పాను. కానీ విమర్శలు వచ్చేసరికి.. తీసేయాలని నా టీమ్‌కు చెప్పానని విజయ్ తెలిపాడు. మరి ఇప్పటికైనా ఆ ట్యాగ్ గోల ఆగుతుందా?