టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలన విజయాల ద్వారా విజయ్ దేవరకొండ పాపులారిటీని సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో నటిస్తున్నారు. విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలతో యువతలో క్రేజ్ ను పెంచుకున్నారు. త్వరలో ఆనంద్ హీరోగా నటించిన పుష్పకవిమానం రిలీజ్ కానుంది.
పుష్పక విమానం రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుండగా విజయ్ దేవకొండ ఈ సినిమాకు నిర్మాత కావడం గమనార్హం. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్, ఆనంద్ ఒక ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ప్రోమోలో విజయ్ వేసవి సెలవులకు ఇంటికి వచ్చేవాళ్లమని రెండు నెలలు ఇంట్లో సరదాగా గడిపేవాళ్లమని ఆనంద్ మాత్రం తనకు చుక్కలు చూపించేవాడని తెగ విసిగించేవాడని చెప్పుకొచ్చారు.
ఆ తరువాత విజయ్ దేవరకొండ తన కంటే తమ్ముడు ఆనంద్ కే మొదట వివాహం అవుతుందని తెలిపారు. అయితే ఆనంద్ మాత్రం అన్నయ్య విజయ్ కే ముందు పెళ్లి అవుతుందని సైగలు చేశారు. 38 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకోగా పూర్తి వీడియో త్వరలో విడుదల కానుంది. పుష్పక విమానం సినిమాతో ఆనంద్ మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటాడేమో చూడాల్సి ఉంది. మిడిల్ క్లాస్ మెలోడీస్ సక్సెస్ వల్ల ఆనంద్ కు యూత్ లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆనంద్ సక్సెస్ కావడానికి విజయ్ కూడా ఎంతో కృషి చేస్తుండటం గమనార్హం.
Most Recommended Video
సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్ టాప్ భామల రెమ్యూనరేషన్ ఎంతంటే?