Vijay Devarakonda: ఆ హీరోయిన్ పై విజయ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

విజయ్ దేవరకొండ రష్మిక కాంబినేషన్ లో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు తెరకెక్కగా ఈ సినిమాలలో గీతా గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే డియర్ కామ్రేడ్ మూవీ మాత్రం ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. అయితే విజయ్ దేవరకొండ రష్మిక మధ్య ఏదో ఉందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని అటు విజయ్ ఇటు రష్మిక చాలా సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు.

తాజాగా విజయ్ దేవరకొండ కాఫీ విత్ కరణ్ షోలో మాట్లాడుతూ రష్మిక గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రష్మిక మందన్నను డార్లింగ్ అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. నేను రష్మిక కలిసి రెండు సినిమాలలో నటించామని విజయ్ తెలిపారు. రష్మిక మందన్న ఒక డార్లింగ్ విజయ్ చెప్పుకొచ్చారు. రష్మికను నేను చాలా ఇష్టపడతానని విజయ్ చెప్పుకొచ్చారు. రష్మిక నాకు చాలా మంచి ఫ్రెండ్ అని విజయ్ తెలిపారు. నటిస్తున్న సినిమాల గురించి, కష్టసుఖాల గురించి నేను, రష్మిక చర్చించుకుంటామని విజయ్ దేవరకొండ అన్నారు.

మా మధ్య బంధం ఏర్పడిందని సినిమాలలో త్వరగా సాన్నిహిత్యం ఏర్పడుతుందని అంతే త్వరగా బంధం అభివృద్ధి చెందుతుందని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. రిలేషన్ షిప్ గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నరోజున ప్రేమ విషయాన్ని గట్టిగా చెబుతానని తెలిపారు.

అప్పటివరకు నన్ను అభిమానించే వాళ్ల మనోభావాలను నేను గాయపరచనని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. నా ఫ్యాన్స్ అంతా నాకు అభిమానాన్ని, ప్రేమను ఇస్తున్నారని విజయ్ దేవరకొండ తెలిపారు. ఫ్యాన్స్ హృదయాన్ని బధ్దలు చేయాలని అనుకోవడం లేదని విజయ్ దేవరకొండ కామెంట్లు చేశారు. ఇండియాలో మోస్ట్ డిజైరబుల్ వుమెన్ ఎవరనే ప్రశ్నకు సామ్ పేరును విజయ్ బదులివ్వడం గమనార్హం.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus