Nagarjuna: నాగార్జునతో శైలేష్ కొలను మూవీ…!

శైలేష్ కొలను (Sailesh Kolanu) స్వతహాగా డాక్టర్ అయినప్పటికీ… సినిమాలపై ఉన్న ప్యాషన్ తో దర్శకుడిగా మారాడు. హీరో నాని (Nani), నిర్మాత దిల్ రాజు(Dil Raju).. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి.. ఇతని ప్యాషన్ చూసి వెంటనే డైరెక్టర్ ని చేశారు. అలా ‘హిట్’ (HIT)   (హిట్ : ది ఫస్ట్ కేస్) తో మొదటి అడుగు వేశాడు శైలేష్. అది మంచి విజయం సాధించింది. అటు తర్వాత ‘హిట్ యూనివర్స్’ లోనే మరో 7 కథలు రెడీ రెడీ చేశాడు.

Nagarjuna

అలా ‘హిట్ 2’ (HIT 2)  అడివి శేష్ తో (Adivi Sesh)  చేశాడు. అది కూడా సూపర్ హిట్ అయ్యింది. తర్వాత ‘హిట్’ సినిమాని హిందీలో రీమేక్ చేశాడు. అది ఫ్లాప్ అయ్యింది. దిల్ రాజు ఆ సినిమాకి నిర్మాత. ‘హిట్’ హిందీలో ప్లాప్ అయినా వెంకటేష్ (Venkatesh)   తో ‘సైందవ్’ (Saindhav) అనే యాక్షన్ మూవీ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు శైలేష్. ఇది పెద్ద ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ లో శైలేష్ ఒక సినిమా చేయాలి. కానీ ఎందుకో అది డిలే అవుతుంది.

ఇలాంటి టైంలో నాని పిలిచి ‘హిట్ 3’ (HIT 3)  ఛాన్స్ ఇచ్చాడు. మే 1న ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్లో నిర్వహిస్తున్నారు. ఈ సినిమా తర్వాత శైలేష్ మళ్ళీ ‘హిట్ 4’ చేస్తాడేమో అని అంతా అనుకున్నారు. కానీ ఈ లోపు మరో సీనియర్ హీరోని అప్రోచ్ అయ్యాడట. అతను మరెవరో కాదు నాగార్జున. నాగార్జున (Nagarjuna)  ‘నా సామి రంగ’  (Naa Saami Ranga)  తో ఓ డీసెంట్ హిట్ కొట్టి ఫామ్లోకి వచ్చాడు.

కానీ అది అభిమానులకు సరిపోలేదు. ప్రస్తుతం ‘కుబేర’ (Kubera) ‘కూలి’ (Coolie)  వంటి సినిమాల్లో నటిస్తున్నా.. సోలో హీరోగా ఓ సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొట్టాలని అభిమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలో శైలేష్ చెప్పిన కథ నాగార్జునకి నచ్చింది. అయితే ‘హిట్ 3’ రిజల్ట్ ను బట్టి.. ఆయన నెక్స్ట్ స్టెప్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది.

నానిని ఢీకొట్టే ప్రతినాయకుడిగా ఆ యంగ్ యాక్టర్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus