Vijay Devarakonda: మనం ఎవరైనా లక్ష్యం కోసం పోరాడాలి!

  • July 29, 2022 / 04:56 PM IST

విజయ్ దేవరకొండ ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు.ఈయన ఇండస్ట్రీలో కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ నేడు ఏకంగా పాన్ ఇండియా సినిమా చేసే స్థాయికి ఎదిగారు. వచ్చేనెల 25వ తేదీ లైగర్ సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా విజయ్ దేవరకొండ నటి అనన్య పాండే కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ నెపోటిజం గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.కరణ్ జోహార్ నెపోటిజం గురించి మీ అభిప్రాయం చెప్పండి అని ప్రశ్నించగా విజయ్ షాకింగ్ సమాధానం చెప్పారు. మన పుట్టుక మన చేతుల్లో ఉండదు మనం ఎవరికి పుట్టాలి ఎలా పుట్టాలి అన్నది మనం నిర్ణయించుకోలేము. ఇప్పుడు స్టార్ వారసులుగా పుట్టిన వారందరూ అనుకోని స్టార్ కిడ్స్ కాలేదు అంటూ ఈయన సమాధానం చెప్పారు.

ఇక రేపు నాకు పుట్టిన పిల్లలు కూడా స్టార్ కిడ్స్ అవుతారని.మనం ఎవరికి పుట్టిన మనం ఎవరైనా, ఎలా ఉన్నా మన లక్ష్యమే ముఖ్యం అంటూ ఈ సందర్భంగా విజయ్ సమాధానం చెప్పారు.అయితే స్టార్ కిడ్ గా పుట్టడం వల్ల కొన్ని లాభాలు ఉంటాయని వారికి మంచి స్టార్ట్ దొరుకుతుందని ఈ సందర్భంగా ఈయన తెలిపారు.తాను ఇండస్ట్రీలోకి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డానని అవమానాలు పడ్డానని అయితే, ఆ కష్టాలను స్టార్ కిడ్స్ పడరని ఈ సందర్భంగా విజయ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ పరోక్షంగా నెపోటిజం గురించి మాట్లాడుతూ తాను నెపోటిజం కి వ్యతిరేకి కాదంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.విజయ్ దేవరకొండ చివరిగా వరల్డ్ ఫేమస్ లవర్ డియర్ కామ్రేడ్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమాలో పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేదు. ఇకపోతే పూరి జగన్నాథ దర్శకత్వంలో విజయ్ నటించిన లైగర్ సినిమా ఈనెల 25వ తేదీ విడుదల కానుంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus