Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండకు రీల్స్‌ పంపిన ఆంటీ… రౌడీ హీరో రియాక్షన్‌ చూశారా?

సోషల్‌ మీడియా విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) (అండ్‌ టీమ్‌) చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన గురించి ఎవరు మెసేజ్‌ చేసినా రిప్లైలు (దాదాపుగా) ఇస్తూ ఉంటారు. అలా విజయ్‌ ఇటీవల ఓ సీనియర్‌ నెటిజన్‌కి ఇచ్చిన రిప్లైకి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దానికి కారణం విజయ్‌కి వచ్చిన వీడియో, ఆ వీడియో పంపిన ఆంటీకి ఆయన ఇచ్చిన లవబుల్‌ రిప్లైనే. మీరు చూసినా కూడా విజయ్‌ (అండ్‌ టీమ్‌) భలే రిప్లై ఇచ్చారు అనిపిస్తోంది.

Vijay Devarakonda

హీరోలు – ఫ్యాన్స్‌.. ఈ రిలేషన్‌ ఒక్కో హీరోతో ఒక్కోలా ఉంటుంది. అలా విజయ్‌ దేవరకొండ అభిమానం కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. అలాంటి విజయ్‌కి ఓ పెద్దావిడ పర్సనల్‌ మెసేజ్‌గా ఓ వీడియోను పంపించారు. సోషల్‌ మీడియాలో ఆమెకు కనిపించిన వీడియో.. విజయ్‌కి బాగా ఉపయోగడపడుతుంది అని పంపించారట. ఆ వీడియో చూసిన విజయ్‌.. థాంక్యూ ఆంటీ.. మీక్కూడా ఇలాంటి ఫన్నీ, ఇంట్రెస్టింగ్ రీల్స్‌ను పంపిస్తాను అని రిప్లై ఇచ్చాడు.

ఈ మొత్తం వ్యవహారాన్ని ఆ పెద్దావిడకు సంబంధించిన వాళ్లెవరో సోషల్‌ మీడియాలో ఓ వీడియోగా షేర్‌ చేశారు. అదే ఇప్పుడు వైరల్‌గా మారి విజయ్‌ అభిమానం ఎలా ఉంటుందో తెలుపుతోంది. ఇక ఆ వీడియోలో ఏముందో చూస్తే.. ఆ రీల్‌ను విజయ్ దేవరకొండకు ఎందుకు పంపావ్ అని ఆ పెద్దావిడకు సంబంధించిన వాళ్లెవరో అడిగారు.

దానికి ఆమె నవ్వేసి ఊరుకుంది. అయితే పక్కనుండి విజయ్‌కి బట్టల షాపు ఉంది కదా పనికొస్తుందని పంపించిందట అని చెప్పారు. దీంతో అందరూ నవ్వేశారు ఆ వీడియోలో. ఇదంతా ఆమె పంపినన వీడియో ఏంటి అనేగా మీ డౌట్. బట్టలు ఫ్రీగా కుట్టే చోటు, ఫ్రీగా ఆల్ట్రేషన్ చేయించే చోటుని ప్రమోట్ ఓ నెటిజన్‌ రీల్‌ చేశాడు. ఆ వీడియోను విజయ్‌కి ఆ పెద్దావిడ పంపించారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus