Vijay, Samantha: సమంత పై షాకింగ్ కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ..వీడియో వైరల్!

మహానటి సినిమా తర్వాత సమంత, విజయ్ దేవరకొండ మరోసారి కలిసి నటించిన చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఖుషి సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇప్పటికే ఖుషి సాంగ్స్, ట్రైలర్‍కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 1న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించేందుకు ఖుషి సినిమా సిద్ధంగా ఉంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచింది టీమ్. తాజాగా రాజీవ్ కనకాలతో కలిసి ఖుషి చిత్రబృందాన్ని ఇంటర్వ్యూ చేసింది యాంకర్ సుమ.

యాంకర్ సుమ చేసిన ఇంటర్వ్యూలో సమంత, విజయ్ దేవరకొండతోపాటు డైరెక్టర్ శివ నిర్వాణ, కమెడియన్ వెన్నెల కిశోర్ పాల్గొన్నారు. విజయ్, సమంతలను సుమ రాపిడ్ ఫైర్‍లో భాగంగా ఒకరి గురించి మరొకరిని క్వశ్చన్స్ చేసింది. సమంతకు నచ్చని ఫుడ్ ఏంటని విజయ్‍ను అడిగితే.. ‘ఆమెకు మాంసం అంటే అస్సలు ఇష్టం ఉండదు’ అని చెప్పాడు. విజయ్‍కు నచ్చని ఫుడ్ గురించి అడిగితే.. ‘ఎక్కువగా స్వీట్స్ ఉన్న ఐటమ్స్ నచ్చవు’ అని సమంత తెలిపింది.

‘సమంతకు ఫేవరేట్ హీరో’ గురించి సుమ అడగ్గా.. ‘సమంత ఫేవరేట్ హీరో నేను మాత్రమే’ అని విజయ్ దేవరకొండ బదులిచ్చాడు. అలాగే ‘విజయ్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు’ అని సమంతను అడిగితే.. ఆమె అలియా భట్ అని టక్కున ఆన్సర్ ఇచ్చింది. మరి ఫేవరేట్ యాంకర్ ఎవరని అడిగితే.. ‘ఇప్పుడున్న యాంకర్స్ లలో నాకు మీరు తప్పా మరెవరూ తెలియదు’ అని విజయ్ దేవరకొండ, కరణ్ జోహార్ అని సమంత చెప్పుకొచ్చారు.

సరదాగా సాగుతున్న సుమ ఇంటర్వ్యూలోనే (Samantha) సమంతపై విజయ్ దేవరకొండ ఊహించని విధంగా కామెంట్స్ చేశాడు. “నేను సమంత బోర్డ్ గేమ్స్ ఆడుతుంటే తను చాలా చీటింగ్ చేసి ఆడుతుంది. జెన్యూన్‍గా ఒక సంఘటనలో నాకు సామ్ ఇంటలిజెన్స్ తెలిసింది. నేను చాలా ఇంటలిజెంట్ అని నా ఫీలింగ్. కానీ, సామ్ ఇంటెలిజెన్స్ ఆరోజు తెలిసింది. బోర్డ్ గేమ్స్ లో సామ్ ఎంత చీటింగ్ చేస్తుందంటే.. దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా కూడా ఉండదు. అంతలా చీటింగ్ చేస్తుంది” అని విజయ్ సరదాగా చెప్పుకొచ్చాడు.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus