మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..!

ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ చిత్ర షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ. భరత్ కమ్మ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో విజయ్ -రష్మిక కలిసి నటించిన ‘గీత గోవిందం ‘ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేయగా.. మరోసారి ఈ జంట జతకడుతుండడం విశేషం. ఈ చిత్రంతో పాటు ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ డైరెక్షన్లో కూడా ఓ చిత్రాన్ని లైన్లో పెట్టాడు విజయ్.

‘డియర్ కామ్రేడ్’ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రం తరువాత విజయ్ నటిస్తున్న చిత్రాన్ని కూడా.. ఈ సంస్థే నిర్మించబోతున్నట్టు తాజా సమాచారం. ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఈ చిత్రం ఉండబోతుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉండబోతుందని సమాచారం. ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో విజయ్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పండిందనే సంగతి తెలిసిందే. ఇక ‘గీత గోవిందం’ చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యాడు. వెంకీ అట్లూరి సినిమాలు కచ్చితంగా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా మెప్పించే విధంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో ఈ చిత్రం… ఆ రెండు చిత్రాల్ని మించి విజయం సాధిస్తుందని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఇక వెంకీ అట్లూరి డైరెక్షన్లో ‘మిస్టర్ మజ్ను’ చిత్రం జనవరి 25 న విడుదల కాబోతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus