ఇప్పటివరకూ విజయ్ దేవరకొండ ఎంత పెద్ద సక్సెస్ సొంతం చేసుకొన్నా.. దానివెనుక నిర్మాతల ప్లానింగ్ కూడా ఉండేది. ఉదాహరణకు “గీత గోవిందం” లాంటి ఒక సాదాసీదా సినిమా 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అవ్వగలిగింది అంటే అందుకు ముఖ్యకారణం అల్లు అరవింద్ ప్లానింగ్. ఆ సినిమా విడుదలకు ఒక రెండు వారాల ముందు.. విడుదలైన నెల తర్వాత చెప్పుకోదగ్గ సినిమా ఏదీ విడుదలవ్వకుండా ప్లాన్ చేశారు కాబట్టే జనాలు వేరే ఆప్షన్ లేక “గీత గోవిందం” చిత్రాన్ని విశేషంగా ఆదరించి అఖండ విజయాన్ని అందించారు. కానీ.. విజయ్ దేవరకొండ చాలా ఆశలు పెట్టుకొన్న “డియర్ కామ్రేడ్” విషయంలో మాత్రం అలా జరిగే అవకాశం కనిపించడం లేదు.
భారీ స్థాయిలో డిస్ట్రిబ్యూటర్స్ ను మ్యానేజ్ చేయడం వలన సోలో రిలీజ్ దొరుకుతున్నప్పటికీ.. ఆల్రెడీ థియేటర్లలో రచ్చ చేస్తున్న “ఇస్మార్ట్ శంకర్” నుంచి “డియర్ కామ్రేడ్”కి గట్టి పోటీ ఎదురవ్వనుంది. సో, విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలంటే మాస్ ఆడియన్స్ ను కూడా అలరించగలగాలి. అంటే రామ్ రేంజ్ ఎనర్జీతో మెప్పించగలగాలి. ఇదంతా జరిగే విషయమా.. మాస్ ఆడియన్స్ నుంచి “డియర్ కామ్రేడ్”కు ఆశించిన స్థాయి రిసెప్షన్ లభిస్తుందా లేదా? అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.