అవును విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) రూ.200 కోట్ల కల నెరవేరేలా కనిపిస్తుంది. ‘లైగర్’ (Liger) ‘ది ఫ్యామిలీ స్టార్’ Family Star) ప్రీ రిలీజ్ ఈవెంట్లలో విజయ్ దేవరకొండ.. ‘ఈ సినిమాలు రూ.200 కోట్లు కలెక్ట్ చేయాలని అని ఆశిస్తున్నట్టు’ తెలిపాడు. అందులో ఎలాంటి తప్పు లేదు. విజయ్ మిడ్ రేంజ్ హీరో లిస్టులోనే ఉన్నాడు. కానీ ఒక సాలిడ్ హిట్టు పడితే కచ్చితంగా స్టార్ హీరోల లిస్టులోకి చేరిపోతాడు. అందులో ఎలాంటి సందేహం లేదు.
రవితేజ (Ravi Teja), నాని (Nani) వంటి హీరోల కంటే ముందే ‘గీత గోవిందం’ (Geetha Govindam) తో వంద కోట్ల క్లబ్లో చేరిన మిడ్ రేంజ్ హీరోగా చరిత్ర సృష్టించాడు విజయ్ దేవరకొండ. కానీ తర్వాత అతని నుండి వచ్చిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి. అందువల్ల రేసులో వెనుకపడ్డాడు. ‘లైగర్’ డిజాస్టర్ సినిమానే. కానీ హిందీలో అది రూ.6 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. హిందీలో దీనికి ఎటువంటి నష్టాలు రాలేదు. సో విజయ్ కి నార్త్ లో కూడా సూపర్ క్రేజ్ ఉంది అనడానికి ఇది నిదర్శనం.
అన్నీ అనుకున్నట్టు జరిగితే.. ‘కింగ్డమ్’ (Kingdom) సినిమా రూ.200 కోట్ల క్లబ్లో చేరే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. ఎన్టీఆర్ (Jr NTR) , సూర్య (Suriya) , రణబీర్ కపూర్ (Ranbir Kapoor) వంటి స్టార్స్ ఈ టీజర్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల పక్క రాష్ట్రాల నుండి కూడా మంచి బిజినెస్ ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తుంది. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రూ.140 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నారు.
మొదటి భాగానికి అప్పుడే రూ.120 కోట్ల బిజినెస్ డీల్స్ వచ్చినట్టు సమాచారం. సో ‘కింగ్డమ్’ కి ఎంత క్రేజ్ ఉందో.. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ రిలీజ్ రోజున పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే.. థియేట్రికల్ కూడా రూ.200 కోట్లు కొట్టడం.. కేక్ వాక్ అనడంలో సందేహం లేదు. మే 30 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది