విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘‘పుష్పక విమానం’’ లోని ‘‘సిలకా’’ పాట విడుదల

యంగ్ స్టార్ ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా “పుష్పక విమానం”. దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ సమర్పణలో ‘కింగ్ అఫ్ ది హిల్’ ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ కి గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. ‘‘పుష్పక విమానం’’ మూవీ నుండి మొదటి సాంగ్ ‘‘సిలకా’’ ను ఇవాళ (సోమవారం మార్చి 15) ఉదయం 11.07 నిమిషాలకు స్టార్ హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు.

‘‘సిలకా ఎగిరిపోయావా ఆసలన్ని ఇడిసేసి ఎనకా…సిలకా చిన్నబోయిందె సిట్టి గుండె పిట్ట నువ్వు లేక ‘‘ అంటూ సాగే ఈ పాటకు రామ్ మిరియాల సంగీతాన్ని అందించడంతో పాటు మరో గీత రచయిత ఆనంద్ గుర్రం తో కలిసి సాహిత్యాన్ని అందించారు. చమన్ బ్రదర్స్ అనే బ్యాండ్ పేరుతో మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిరియాల, కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ పాటలో కనిపిస్తున్నారు. వాళ్లు పాడుతూ డాన్సులు చేస్తూ పాటకు జోష్ తీసుకొచ్చారు.

*ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశలో ఉన్న ‘‘పుష్పక విమానం’’ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. *

ఆనంద్ దేవరకొండ, గీత్ సైని, శాన్వి మేఘన, సునీల్, నరేష్, హర్షవర్థన్, గిరిధర్, కిరీటి, భద్రం, వైవా హర్ష, అభిజిత్, అజయ్, సుదర్శన్, శరణ్య, మీనా వాసు,షేకింగ్ శేషు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ : విజయ్ దేవరకొండ, పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా, సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్, ఆర్ట్ డైరెక్టర్ : నీల్ సెబాస్టియన్, ఎడిటర్ : రవితేజ గిరిజాల, మ్యూజిక్: రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని, కాస్టూమ్స్ : భరత్ గాంధీ, నిర్మాతలు: గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి , ప్రదీప్ ఎర్రబెల్లి రచన-దర్శకత్వం: దామోదర


శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus