ఏదైనా పరిస్థితిని మనం చూసే విధానం వేరు, విజయ్ దేవరకొండ చూసే విధానం వేరు. ఈ మాట మేం అనడం లేదు. ఆయన మాటలే అనిపిస్తుంటాయి. దానికి ఆయన యాటిట్యూడట్ అని పేరు పెడితే… నెటిజన్లు రకరకాలుగా పేర్లు పెడుతుంటారు. అవన్నీ వదిలేస్తే విజయ్ మాటలు ఒక్కోసారి డిఫరెంట్‌గా అనిపిస్తాయి. అలా మాట్లాడితే ఎవరైనా, ఏమైనా అనుకుంటారా అనే డౌట్ కూడా లేకుండా విజయ్ మాట్లాడేస్తుంటాడు. తాజాగా రజనీకాంత్ కెరీర్ గురించి మాట్లాడాడు మన రౌడీ హీరో.
‘లైగర్’ తో భారీ అపజయాన్ని మూటగట్టుకున్న (Vijay Deverakonda) విజయ్ దేవరకొండ, ఆ సినిమా ప్రచారంలో చూపించిన యాటిట్యూడ్‌తో ఇంకాస్త అపప్రద అందుకున్నాడు. అయితే ఇప్పుడు ‘ఖుషి’ సినిమా ప్రచారంలో కూడా అలానే మాట్లాడుతున్నాడు. అయితే ‘లైగర్’ టైమ్ పరిస్థితి ఇప్పుడు లేదు. ఇటీవల తమిళనాడులో ‘ఖుషి’ సినిమా ప్రచారంలో పాల్గొన్న విజయ్ దేవరకొండ… రజనీకాంత్, చిరంజీవి మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రజనీ సినిమా ఫలితాల ప్రస్తావించడంతో ఆ మాటలు వైరల్‌గా మారాయి.
రజినీకాంత్ ఇటీవల నటించిన ఐదారు సినిమాలు ప్లాప్ అయ్యాయి, కానీ ఆయన ‘జైలర్’ అని వచ్చేసరిఇక… బ్లాక్‌బస్టర్ విజయం అందించారు ప్రేక్షకులు. అలాగే చిరంజీవి ఇండస్ట్రీని మార్చేశారు.. సరైన దర్శకుడు ఆయన ఎనర్జీకి తగ్గట్టుగా సినిమా చేస్తే మరోసారి భారీ విజయం పక్కా అని కామెంట్ చేశాడు. సినిమా ఫలితాల ఆధారంగా నటీనటులను అంచనా వేయకూడదు అనేది విజయ్ దేవరకొండ చెప్పిన మాట. రజినీకాంత్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌లు ఇచ్చినా… ‘జైలర్’ లాంటి బ్లాక్ బస్టర్‌తో బౌన్స్ బ్యాక్ అయ్యారు.
కాబట్టి ఇప్పుడు ఆయన సినిమాలు నోరు మూసుకుని చూడాలి. చిరంజీవికి కూడా బ్యాక్ టు బ్యాక్ ఏడు ఫ్లాప్‌లు వచ్చి ఉండొచ్చు. కానీ ఆయన సరైన సినిమా చేస్తే అందరూ చూశారు. దానికి ‘వాల్తేరు వీరయ్య’నే నిదర్శనం అని అన్నాడు విజయ్. ఇప్పుడు ఆయన మరోసారి అలాంటి కథతో వస్తారని, అప్పుడు అందరూ చూస్తారని ఆయన మాటల సారాంశం. చిరంజీవి ఇండస్ట్రీని చాలా మార్చేశారు. యాక్షన్, డ్యాన్స్ అన్నీ ఆయనచ్చాక మారిపోయాయి. ఇండస్ట్రీలోకి రావడానికి చాలామందికి ఆయన ఆదర్శం, స్ఫూర్తి అంటూ చిరు గురించి చెప్పాడు విజయ్ దేవరకొండ.
2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?
‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!
‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్