ఇటీవల ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) పూరి , ఛార్మీ లను పిలిచి ‘లైగర్’ సినిమా బడ్జెట్, పారితోషికాలు, మరియు ఎవరెవరు పెట్టుబడులు పెట్టారు అనే విషయాల పై విచారించిన సంగతి తెలిసిందే. ‘లైగర్’ సినిమా నిర్మాణం విషయంలో రాజకీయ నేతలు పెట్టుబడులు పెట్టినట్లు చాలా ఆరోపణలు ఉన్నాయి.అందుకే లైగర్ దర్శకుడు పూరికి, నిర్మాత ఛార్మీకి ఈడి కొద్ది రోజుల క్రితం నోటీసులు పంపించడం జరిగింది. కానీ ఈ విషయాన్ని పూరి టీమ్ గోప్యంగా ఉంచింది.
చాలా సీక్రెట్ గా పూరి ఛార్మీతో కలిసి ప్రైవేట్ గా ఇటీవల ఈడీ ఆఫీసుకు వెళ్లడం, ఆ తర్వాత ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ జంటను ఈడీ ప్రశ్నించడం జరిగింది.లైగర్ సినిమాకి విదేశీయులు కూడా పెట్టుబడులు పెట్టినట్లు వారికి సమాచారం అందిందని వినికిడి. వీటిపై కూడా పూరి, ఛార్మి లను ఈడి ప్రశ్నించినట్టు స్పష్టమవుతుంది. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ వంతు వచ్చింది. అతనికి కూడా ఈడీ నోటీసులు పంపడం జరిగింది.
ఈరోజు ఉదయం నుండి విజయ్ ఈడీ ఆఫీస్ లోనే ఉన్నాడు. విచారణ అనంతరం విజయ్ మీడియాతో ముచ్చటించాడు. విజయ్ దేవరకొండ ఈ విషయంపై స్పందిస్తూ.. “మీరు చూపించే ప్రేమ అభిమానం వల్ల వచ్చే పాపులారిటీతో అప్పుడప్పుడు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ను కూడా తెచ్చిపెడుతుంది. బట్ తప్పదు.. ఇది లైఫ్..! ఇదొక ఎక్స్పీరియన్స్ . ఈడీ అధికారులకు ఉన్న కొన్ని డౌట్స్ కు నేను క్లారిఫికేషన్ ఇచ్చాను.
వాళ్లకు పూర్తిగా సహకరించాను. ‘లైగర్’ సినిమా లావాదేవీలపై ఎక్కువ ప్రశ్నలడిగారు. ఎక్కువ మాట్లాడితే వాళ్ళు ఫీలవుతారు. నన్ను మళ్ళీ రమ్మని అయితే చెప్పలేదు.12 గంటలు అయ్యింది. వాళ్ళు విచారణ మొదలుపెట్టి” అంటూ చెప్పుకొచ్చాడు.
లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..