Vijay: ఆ విషయంలో చిరంజీవి, విజయ్ సేమ్ టు సేమ్.. ఏం జరిగిందంటే?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస సినిమాలతో బిజీగా ఉండగా ఆయన రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉంది. అయితే త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న విజయ్ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత సినిమాల్లో నటించే ఛాన్స్ లేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గోట్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత విజయ్ నటించే సినిమా తన పొలిటికల్ కెరీర్ కు ఉపయోగపడేలా మంచి సందేశంతో ఉండబోతుందని తెలుస్తోంది.

విజయ్ తర్వాత సినిమాకు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాల్సి ఉండగా ఆయనకు బదులుగా వినోద్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. చిరంజీవి సైతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకున్న సమయంలో ఎక్కువగా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలలో నటించారు. సినిమాల విషయంలో విజయ్ చిరంజీవిని ఫాలో అవుతున్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

దళపతి విజయ్ రాజకీయాల్లో ఏ రేంజ్ లో సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది. తమిళనాడు రాజకీయ లెక్కల్ని విజయ్ మార్చేస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విజయ్ 49 సంవత్సరాల వయస్సులో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. విజయ్ లియో2 సినిమాలో మాత్రం నటించే ఛాన్స్ లేనట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

విజయ్ ను (Vijay) అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా విజయ్ పాలిటిక్స్ లో సక్సెస్ అయ్యే వరకు సినిమాల్లో కొనసాగితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. విజయ్ తర్వాత సినిమాలు కచ్చితంగా సక్సెస్ కావాలని మరి కొందరు చెబుతున్నారు. విజయ్ కు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వస్తున్న సమయంలో పాలిటిక్స్ కు సంబంధించి తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ అవుతోంది.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags