జాకీచాన్, రజనీకాంత్ ల తర్వాత సౌత్ ఇండియాలో భారీ పారితోషికం తీసుకొనే ఏకైక కథానాయకుడు ఇళయదలపతి విజయ్. దాదాపు 60 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకొంటాడు విజయ్. ఆయన నటించే సినిమాలు మినిమమ్ 200 కోట్లు వసూల్ చేయడమే ఇందుకు ముఖ్యకారణం. అది కాకుండా మళ్ళీ తెలుగు, మలయాళ రాష్ట్రాల్లో డైరెక్ట్ థియేటర్ రిలీజ్, హిందీ డబ్బింగ్ అన్నీ కలుపుకొని మరో 50 కోట్ల దాకా వసూలు చేస్తాయి విజయ్ సినిమాలు.
అందుకే మనోడు 60 నుంచి 70 కోట్ల దాకా రెమ్యూనరేషన్ తీసుకొంటాడని తమిళ వర్గాలు చెవులు కొరుక్కోంటాయి. అయితే.. ఇప్పుడు కరోనా దెబ్బతో థియేటర్లు మూతపడడం, తన కొత్త సినిమా “మాస్టర్”కు అనుకున్న స్థాయి ఓపెనింగ్స్ వస్తాయో రావో అనేది తెలియని కన్ఫ్యూజన్, అసలు థియేటర్ రిలీజ్ ఉంటుందో లేదో అనే క్లారిటీ లేకపోవడం.. ఇలా పలు కారణాల వల్ల విజయ్ తన రెమ్యూనరేషన్ ను 20 కోట్ల వేటు వేసుకొన్నాడు.
తనకు రావాల్సిన బాకీ రెమ్యూనరేషన్ లో 20 కోట్లు కట్ చేసుకొని మిగతాది సినిమా విడుదలయ్యాక ఇవ్వమని చెప్పాడట నిర్మాతలకు. అలాగే తన తదుపరి సినిమాలకు కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతాడట. మరి మన తెలుగు స్టార్లు ఈ పద్ధతిని ఎప్పటికీ అలవరుచుకుంటారో, ఎప్పటికీ ఆచరణలో పెడతారో చూడాలి. మొత్తానికి కరోనా స్టార్ హీరోల ముక్కు పట్టుకొని మరీ కిందుకు లాగుతోందన్నమాట. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎంతో కాలంగా చేస్తున్న ప్రయత్నానికి ఇప్పటికి ఫలితం లభించిందన్నమాట.